పాదయాత్ర సరే…నినాదమేదీ..!?
ఆనాడు … రైతు కేంద్రంగా సాగిన పాదయాత్ర ప్రజా ప్రస్థానం తో వై.యస్ రాజశేఖర్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కొంతమంది నాయకులు పాదయాత్రలు చేసిన సందర్భాలున్నాయి. (అది వేరే విషయం) మళ్ళీ దశాబ్ద కాలం తర్వాత అదే స్ఫూర్తితో తన తనయుడు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రైతు కేంద్రంగా పాదయాత్రను చేపట్టారు.
రైతు కేంద్రంగా సాగుతున్న ఈ యాత్రలో అప్పటి పరిస్థితులున్నాయా..? ఏ నినాదం తీసుకొని ప్రజల వద్దకు వెళుతున్నారు..? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు అంటే ఎవరు..? సాగుచేసే వారా.. లేక పట్టా దారులా…? వీరిద్దరిలో ఎవరిని రైతుగా గుర్తిస్తున్నారు. అనేవి సగటు ఓటరులో మెదులుతున్న ప్రశ్న.
ఒకప్పటి యాత్రను దృష్టిలో పెట్టుకొని చేస్తే జగన్ కు ఇక్కట్లు తప్పవు. ప్రస్తుత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని, రైతులను పట్టించుకునే పరిస్థితులు లేవని కేవలం రాజదాని చుట్టే ప్రదక్షిణలు చేస్తుందంటూ విమర్శిస్తూ ప్రజల వద్దకు వేళితే ప్రయోజనం ఉంటుందా..? మరీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందు గత ఎన్నికల మేనిపేస్టోలో కనీసం రైతుల రుణమాఫీ ప్రస్తావనే లేదు. కదా..! ఇప్పుడు జనాల ముందుకొచ్చి ఏమి చెప్పబోతున్నారు ..? అనేది గ్రహించాలి. అందుకు తోడు వచ్చే ఎన్నకలకు ప్రజల సమస్యల నుండే మేనిపేస్టో తయారుచేస్తానని చేపుతున్న ప్రతిపక్ష నేత ఏ విధంగా తయారు చేస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రస్తుత యాత్రకు సంబందించిన నినాదమేంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే తన తండ్రి చేపట్టిన పాదయాత్రలో రైతులను ఆకర్షించిన నినాదం: ఉచిత కరెంట్ ఇస్తామని రాష్ట్రమంతటా పర్యటించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం అలాంటి ఒక నినాదం ఉంటే తప్ప యాత్ర విజయవంతం కాదనేది నగ్న సత్యం. అయితే అంతా నేనే ఆన్నట్లు ప్రవర్తించే జగన్ దీన్ని ఎలా స్వాగతిస్తాడో చూడాలి …మరీ..!