Andhra

’చంద్ర‘ కాంతి సోకితే ’కమలం‘ వికసించదా..?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి ఒరిగిందేమీ లేదని లేటుగానైనా లాజిక్‌ అర్థం చేసుకుంది కమలదళం.‘చంద్ర చాణక్య’ తటాకంలో కమలం వికసించడమనేది కలలో మాట అని హస్తిన నుంచి ఆంధ్రాదాకా పెద్దలకు అర్థం అయినట్లుంది.   పొత్తు వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువనుకుంటున్నారు. చంద్రునితో  చెలిమి కోరితే కమలం పూర్తిగా వాడిపోక తప్పదు అని గహించిన పెద్దలు వద్దు అని  ముచ్చటించుకుంటున్నారు.
మా కమలం ఏదో మేమే మా తోటలో పూయించుకుంటామని రాష్ట్ర కమనాథులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పరిణామాు రోజురోజుకు విభిన్నంగా మారుతున్న తరుణంలో మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్ర పర్యాటనంతరం రాష్ట్ర బీజేపీ నాయకుల్లో పెరిగిన ఉత్సాహం మరింత ఎక్కువగా కనుబడుతోంది.  రాష్ట్రంలో టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత  ఎక్కువగా ఉండడం వల్లో ఎమో కానీ,  రాష్ట్ర కమనాథులు టీడీపీతో దోస్తీ దూరంగా పెడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం సీఎంకు అనుకూలంగా వుంటే, మరొక వర్గం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.వ్యతిరేక వర్గాన్నికి చెందిన వారి మాత్రం రోజు రోజుకి సీఎంనీ  సహచర మంత్రులనూ ఏకి పారేస్తున్నారు. అనుకూల వర్గం మాత్రం ‘చంద్రసేన’ నామ స్మరణ చేస్తున్నారు. వ్యతిరేక వర్గానికి
చెందిన సోము వీర్రాజు 2019లో  స్వంతంగా బరిలోకి దిగుతామని ‘సై’ అంటే ‘సై’ అంటున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఖర్చుచేస్తూనే కేంద్రాన్ని కాటేస్తున్న టీడీపీని ఏమని అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదని అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం రు.3000 కోట్లు చెప్పి రు. 42వే కోట్లు ఇచ్చాం. కానీ కేంద్రం నుంచి నిధులురావటలేదని పదే పదే వాపోతున్నారు.24 గంటల కరెంట్‌ కోసం కోసం 5000 కోట్లు, రోడ్లు నిర్మాణాకు లక్ష కోట్లు, రాజధాని నిర్మాణానికి 3వే కోట్లు, ఎన్‌ఆర్‌జీఎస్‌ కోసం 8వే కోట్లు ఇచ్చాం. ఇన్ని నిధులను కేంద్రం నుంచి తీసుకుని చంద్రబాబు ప్రజలను  మభ్య పెట్టే ప్రయత్నాలు  చేస్తున్నాడు. తాను రాష్ట్రాకి ఎదో చేదామని తపస్సు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ సహకరించటలేదని బాబు ప్రజ ముందు క్లబొల్లి మాటతో గారడి చేస్తున్నాడు. అంటూ వీర్రాజు వర్గం విరుచుకు పడుతోంది. కానీ,  ఇవి కొత్త కేటాయింపులు కావని ‘చంద్ర సేన‘ కొట్టి పారేస్తోంది. ఇద్దరి వాదాల్లో నిజానిజాలు ఎంత- అన్నది పక్కన పెడితే, ఎన్నికల్లో ెెరెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చెయ్యటానికి రంగం సిధ్ధంకుంటున్నాయా- అన్న అనుమానాన్ని మాత్రం పరిశీలకులకు కల్పిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *