Newsips

మరో మూడు తెలుగు దినపత్రికలా..?

 స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే ఆలోచ‌న‌ల‌ను క‌లిగించటంలో   మీడియా ముందుంటుంది.  ప్ర‌చార సాధ‌నాల వ‌ల‌నే పార్టీల వచ్చాయి .నాయ‌కులు గద్దె ఎక్కారు; దిగారు. ఇప్ప‌టికే పార్టీకి ఒకటికి మించి చానెల్స్  ఉండ‌నే ఉన్నాయి. ఇవి ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రింత ఎక్కువ అవుతుంటాయి. గ‌త ఎన్నిక‌ల‌లో  చూసిన‌ట్ల‌యితే ఎల‌క్ట్రానిక్ మీడియా ముఖ్య‌పాత్ర పొషించిద‌నేది వాస్తవంగా ఉంది. అయితే  వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌మ‌యానికి ముఖ్య‌మైన పార్టీలు అందులో జాతీయ పార్టీలు సైతం త‌మ‌కు ఒక సొంత మీడియా ఉండాల‌ని చూస్తున్న‌ట్టు సమాచారం. కానీ  ఈ సారి మోజు చానెళ్ళ మీద కాదు… పత్రికల మీద వుంది.
  వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా  రెండు తెలుగు రాష్ట్రాల‌లో పాగా వేయాల‌ని చూస్తున్న బిజెపి పార్టీ ఒక పత్రిక పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ని విశ్వ‌సనీయంగా తెలిసింది.  ఒక‌ప్పుడు తెలుగు మీడియాలో కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన పత్రిక ‘ఉద‌యం’. ఈ ‘ఉదయాని’కి రెండు టైటిల్స్ సిధ్ధంగా వున్నాయి. ఒకటి మాగుంట కుటుంబం దగ్గర వున్న ‘ఉదయం’. ఇంకొకటి దాసరి నారాయణ రావు వారసుల వద్ద వున్న ‘దాసరి ఉదయం’.  బీజేపీ ఈ పేర్లను పరిశీలిస్తోంది.  బిజెపి కాకుండా మ‌రో జాతీయ పార్టీ ఎలాగైనా ఈసారి తెలుగు రాష్ట్రాల సింహాసనం ద‌క్కించుకొవాల‌నే ప‌ట్టుద‌ల‌తో వున్న కాంగ్రెస్‌కు ఉన్న‌ప‌లంగా సొంత  మీడియా అవసరం వ‌చ్చి ప‌డింద‌ట‌. అయితే ఇందుకోసం ఇప్ప‌టికే  వున్న పాత పేర్లను పరిగణిస్తున్నప్పటికీ , నూత‌న  పత్రిక‌ల‌నే ప్రారంభించే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని స‌మాచారం.
      జాతీయ స్థాయి  పార్టీల‌కు ఏమాత్రం త‌గ్గకుండా ప్రాంతీయ పార్టీలు ఈ విధానాన్నే అనుస‌రిస్తున్నాయ‌ని చెప్పవ‌చ్చు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చూసిన‌ట్ల‌యితే ప్ర‌స్తుత అధికార పార్టీ అయిన టిడిపి మీడియా విష‌యంలో  చాలా ముందున్న‌ది వేరే చేప్ప‌నవ‌స‌రంలేదు. ఇందుకు దీటుగా     వైసీపీ  ఏ మాత్రం తీసిపోకుండా ‘సాక్షి’ తో పాటు,   మ‌రొక పత్రికను ఈ ఎన్నిక‌ల ముందే ప్రారంభించే యోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు జగ‌న్ వ్యుహక‌ర్త‌గా స‌ల‌హాలు అందిస్తున్న ప్ర‌శాంత్ కిషోర్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *