తెలుగు ’చంద్రుల‘ ’ముందస్తు‘ ఊహలకు తెర!
ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహలు రచించడం సహజం. ఇది అనాది కాలం నుండి వస్తున్నదే. సరిగ్గా ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది. సాధారణ ఎన్నికలకు సంవత్సర కాలం ముందే ఎవరికి వారే వ్యూహలు రచించుకున్నారు.ఇక్కడే వారి వ్యూహలు బెడిసికొట్టినట్లయింది.
ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి పదవీ కాలం పూర్తి కాలేదు. అప్పుడే దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ జాతీయ స్థాయి ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్నారు. కొద్ది రోజులుగా అయా పార్టీల అధినేతలను, జర్నలిస్టులను కలిసి మంతనాలు కూడా జరపడం జరిగింది. హఠాత్తుగా ఇపుడు థర్డ్ ఫ్రంట్ కాదు ప్రజల ఫ్రంట్ అని ప్రక్కకు తప్పుకొడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా వుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసినట్లయితే ప్రత్యేక హొదా నినాదంతో టిడిపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది కొద్ది రోజుల్లోనే ప్రత్యేక ప్యాకేజీగా మారింది. చివరకు అదైనా రాష్ట్రానికి అందించారా..? లేదు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టిన పట్టించుకోని బాబు ఇవాళ ఒక్కసారిగా తమ వాయిస్ మార్చడం వెనక అంతర్యం ఏమిటి..? అనేది ప్రజానీకంలో మెదలుతున్న ప్రశ్న.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుకు కారణలేంటి..? అంటే తాజాగా వచ్చిన గోరఖ్ పూర్ ఉప ఎన్నికలలో బిజెపి పరాభావమేనని చెప్పవచ్చు. దీంతో ఇప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం మంచిది కాదని కేంద్రం ఇట్టే గ్రహిస్తుంది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సూక్ష్మ గ్రాహులు. కాబట్టి ఫ్రంట్ ప్రతిపాదననుంచీ కేసీఆరూ, బీజేపీతో తెగతెంపుల యోచన నుంచి చంద్రబాబూ కాస్త వెనక్కి తగ్గుతారు.