కల్యాణ్ రామ్ కో ’క్లాస్’ చిత్రం..?
ఇన్నాళ్ళూ కేవలం మాస్ ఇమేజ్ తోనే ముందుకు వచ్చిన కల్యాణ్ రామ్, త్వరలో కాస్త క్లాస్ ఇమేజ్ తో ముందుకు రాబోతున్నాడు. అది కూడా రవంత హాస్యంతో. ఆశ్చర్యమే. ‘ఉయ్యాల- జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం ఏప్రిల్ లో షూటింగ్ కు వెళ్ళబోతోంది.
ఈ దర్శకుడు ఇంతవరకూ వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలతోనే ముందుకు వచ్చారు. ఇది కూడా అదే కోవలోకి వస్తుంది. బాగా చదువుకున్న యువకుడు, పల్లెలోని వుండి పనిచేసుకుంటానంటే, ఆ పల్లె వాసులే, అతనిని ఎలా నిరుత్సాహ పరస్తుంటారో అన్నఅంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా కళ్యాణ్ రామ్ సరసన, హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది తేల లేదు. అయితే కల్యాణ్ రామ్ కు ఈ చిత్రంతో ఇమేజ్ మారనున్నదా అన్నది.. వేచి చూడాలి.