ఎంత జెండాకు.. అంత దేశభక్తి
హైదరాబాద్: దేశభక్తికి కొలమానాలున్నాయా? ఎవరు చెప్పలేరేమో..? ఒక్కొక్కరి నుంచి ఒక్కోరకంగా సమాధానాలు వస్తుంటాయి. అయితే మన రాజకీయ నాయకులవారికి దేశభక్తి అంటే ఎన్నికల ముందు ఒకలా, తర్వాత మరోలా ఉంటుంది. జెండా సైజును కొలమానంగా చూస్తుంటారు. ఎన్నికల ముందు కరేన్సీ నోటుపై గాంధీని చూపించి తమ దేశభక్తి చాటుకుంటారు. (అది వేరే విషయం లెండి) ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున వున్న ట్యాంక్‌బండ్ పక్కన సంజీవయ్య పార్క్‌లో దేశంలో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తమ దేశ భక్తిని చాటుకున్నారు. నాయకులు దేశభక్తిని చాటుకోడానికి అతిపెద్ద పతాకాన్ని ఆవిష్కరించడమే కొలమానం అవుతుందా..? అనేది సాధారణ ప్రజానీకానికి ఎప్పటికీ ఒక ప్రశ్నగా మిగిపోయింది.
తాజాగా దేశంలోనే అతిపెద్ద జెండాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు తన పార్టీని బలోపేతం చేసే పనిలో వున్న పవన్ సడన్‌గా హైదరాబాద్ నడిబొడ్డున వున్న ఏన్టీఆర్ స్టేడియంలో పోడవైన జాతీయ జెండాను ఆవిష్కరించడంలో మతాలబు ఏంటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి..? అయితే తన పార్టీ నిర్మాణానికి ఈ సభ ఉపయోగపడుతుందా..? పార్టీ క్యాడర్ నిర్మించుకునే పనిలో ఉన్న పవన్‌కు ఈ సభ ఏమేరకు లాభపడుతుంది..? ఇంకా ఎన్నికలకు సంవత్సర కాలం కూడా లేని సమయంలో విధివిధానాలు ప్రకటించని జనసేనానికి ఈ సభ ద్వారా క్యాడర్‌కు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకున్నాడు..? (పార్టీ పరంగా) అనేది తెలియాల్సి వుంది. ఇదంతా పక్కన పెట్టి చూస్తే పవన్ పవర్ కోసం జెండాను ముందుంచి…ఎజెండానను తర్వాత ప్రకటిస్తారా.? అనేది తన వ్యూహాంగా మలుచుకుంటాడా అనేది తెలియలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే…