Bathuku (Life)

వెండితెర మీద వెలిగీ వెలగని జీవితాలు!

కెమెరా ముందు రంగుల జీవితం వారిది. మెరిసే దుస్సుల్లో మేకప్‌ మొహంతో కనిపించే అందమైన జీవితం వారిది. ఇదంతా కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే, ఒక్కసారిగా కెమెరా ఆఫ్‌ అయితే వారి జీవితం కేరాఫ్‌ అడ్రస్‌ లేకుండా అయిపోతుంది. సినిమాకు నిండుతనం తెచ్చే జూనియర్‌ ఆర్టిస్టుల జీవితం తెర వెనుక చాలా దైయనీయమైన జీవితం వారిది.

సినిమా అనే మాయజాలంలో వెలగకుండానే ఆరిపోతున్న జీవితాలు ఈ జూనియర్‌ ఆర్టిస్టులు నిజం చెప్పాలంటే వీరు చేసేవి జూనియర్‌ క్యార్టెర్లే?  హీరో, హీరోయిన్స్‌ వెనుక డ్యాన్స్‌లు చేస్తూ, మార్కెట్లో కూరగాయలు అమ్మేవారిగా, కోనేవారిగా, గుడిలో భక్తుల్లా, పూజారుల్లా, ఊరిలో జనంలా, పోలీసు స్టేషన్‌ల్లో ఖైదీలులా, ఆసుపత్రిల్లో రోగులులా, రోడ్లు మీద నడిచే సామాన్యులలా, గుడి ముందు బిక్షగాళ్ళులా వీళ్ళు వుంటారు. క్యారెక్టర్లు ఏవయినా, అందులో వీళ్ళు పరకాయ ప్రవేశం చేయాలి. అయితే వీరి జీవితమంతా ‘నో డైలాగ్‌ ఓన్లీ యాక్షన్‌’ మాత్రమే. ఇక్కడ ఎక్కువగా వినిపించేది 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ 400 సినిమాలు, కానీ ఉపయోగం లేదు. వీళ్ళు పేరుకు జూనియర్‌ ఆర్టిస్టులే. కానీ యాక్టింగ్‌లో మాత్రం సీనియర్స్‌. వీళ్ళు తీసుకునే రిమ్యూన్యూరేషన్‌ రు.350 కావచ్చు; కానీ  350శాతం నాయ్యం చేస్తారు.

టాలీవుడ్‌లో జూనియర్‌ ఆర్టిస్టులు  హైదరాబాద్‌లో గల కృష్ణానగర్‌, ఇందిరానగర్‌లలో వుంటారు.  తెలుగు రాష్ట్రాల్లో సినిమా మోజుతో వచ్చిన వారంతా ఇక్కడే కనిపిస్తారు. హీరోలు అవుదామని వచ్చినవారు  ఛాన్స్‌లు రాక జూనియర్‌ ఆర్టిస్టులుగా షెటిలవుతారు. రోజుకో సినిమా దొరికితే కానీ వీళ్ళకు పూటగడవని పరిస్థితి వీరిది. ప్రపంచానికి తెల్లవారక ముందే జూనియర్‌ ఆర్టిస్టులకి తెల్లవారుతుంది. ఉదయం 3గంటలకు వీళ్ళ ప్రయాణం మొదలవుతుంది, అన్ని పనులు ముగించుకొని 5 గంటలకు సినిమా అడ్డాకు చేరుకోగా ఆరోజు ఏఏ సినిమాలు ఉన్నాయో తెలుసుకుని ఆ సినిమాలో తమకు అవకాశం వస్తుందా రాదా అని భయం ఒక ప్రక్క, పెద్ద బడ్జెట్‌ సినిమా దోరికితే ఎక్కువ మందికి పనిదోరుకుతుందని ఆశ అందులోనూ అందులోనూ వాళ్ళ వయస్సుకు ఆకారానికి తగ్గ క్యార్టెర్‌ వస్తుందా. ఆరోజు పని ఉందా లేదా అని అనుమానం. ఇవన్నీ జూనియర్‌ ఆర్టిస్టులు నిత్యకృత్యాలు. వీళ్ళలో ఎక్కువగా కథలూ, పాటలూ రాసేవారు వుంటారు. కానీ వీళ్ళ ప్రతిభను ప్రోత్సాహించేవారు ఉండరు. జూనియర్‌ ఆర్టిస్టులకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫర్లు కూడా ఉంటాయి, అందులో మెంబర్‌ షిప్‌ తీసుకోవడాని 15000 రూపాయలు ఖర్చు అవుతోంది. మెంబర్‌ షిప్‌ ఉన్న వారికి మాత్రమే తీసుకోబోయే రెమ్యూన్యూరేషన్‌ గ్రేడింగ్‌ ఉంటుంది. మహిళల్లో  బాగా చలాకీగా, అందంగా ఉన్నవారికి ‘ఏ’ గ్రేడ్‌ అని వీళ్ళకి 700 రూపాయలు, అందంగా ఉండి బాగా చేయగలవారికి ‘బీ’ అని, వీళ్ళకి 450 రూపాయలు, మాస్‌ క్యారెక్టర్‌ చేయగలవారికి ‘సీ’ గ్రేడ్‌కి 350 రూపాయలు ఇస్తారు.

జూనియర్‌ ఆర్టిస్టులకు వచ్చే డబ్బులు కాస్తా వాళ్ళ బతకడానికే చాలీచాలక రోడ్ల సైడ్‌ ఖాళీల్లో గుడారాలు వేసుకుని నివసిస్తుంటారు, ఆరోజు షూటింగ్‌ దోరికితే మంచి టిఫిన్‌,భోజనం దొరికినట్టే, లేకపోతే ఆరోజు పస్తే. వీళ్ళ ఆకలి కేకలను దిగమింగుకుని మనకు ఆనందాన్ని అందిస్తుంటారు. ఈ రంగుల ప్రపంచంలో ఏ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను అడిగినా అంతులేని వేదనలు. వాళ్ళకున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  పైకి నవ్వూతూ లోలోపల దు:ఖిస్తుంటారు. ’తెలుగూస్‌ డాట్ కామ్’ వాళ్ళను పలకరించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలివి.

ప్రభుత్వాలూ, సినిమా పెద్దలూ వీళ్ళను పట్టించుకుని చేయూత నివ్వాలని ఆశిద్దాం.

 -కామేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *