రద్దు ‘అన్న’దా..? ‘బాబు’దా..?
తెలుగు నోట ఏ మాట విన్నా ఇప్పుడు కేసీఆర్ గురించే . పేపర్, టి.వి లలో గానీ, లేదా టీ కోట్టుల వద్ద గానీ, నలుగురు కూర్చున్న సమయంలో కానీ.. ఎక్కడ చూసినా ఈ గులాబీ బాస్ గురించే చర్చ. గత రెండు వారాలనుంచి వినిపిస్తున్న మాటలు నిజమేనా అని సందేహించిన సందర్భాలుండేవి. కానీ ఇప్పుడు ఆ సందేహలకు ఒక రకంగా పుల్‌స్టాప్ పెట్టేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.
ఎట్టకేలకు ముందస్తుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముందస్తుకు ముందుగానే పయనమైన కేసీఆర్ ఎవరి బాటలో ముందుకు వెళతారో మున్ముందు చూడాలి. గతంలో 1984 లో ఆనాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.టి.రామారావు మూడు సంవత్సరాల పైగా పదవీకాలం ఉండగానే ముందస్తుకు వెళ్ళి తిరగి గెలిచారు. ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు కూడా 2003లో ఎనిమిది నెలల పదవీ కాలం ఉండగానే ముందస్తుకు వెళ్ళి ఓడిపోవడం జరిగింది. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు పయనమయ్యారు.
తెలుగు రాష్ట్రాలలో ముందస్తుకు వెళ్ళిన ఈ ముగ్గురు నేతలు కూడా ఒకే గూటి పక్షులే. ఇందులో ఎన్.టి.ఆర్ ముందస్తుకు వెళ్ళి విజయం సాధించారు. కానీ చంద్రబాబుకు ఆ ఫలితం లేకుండాపోయింది. కాని ఇప్పుడు కేసీఆర్ వీరిద్దరిలో ఏవరి వారసత్వం తీసుకుంటారో మరీ..!