Hyderabad

బీజేపీకి సీఎం అభ్య‌ర్థి దొరికాడు..?

ఉత్త‌ర భార‌త దేశానికి ప‌ట్టుకొమ్ముగా ఉన్న బీజేపీకి ద‌క్షిణ భార‌తంలో ఏవిధంగానైనా పాగా వేయాల‌న్న క‌ష్ట‌కాలం ఎదుర‌వుతూనే వుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక క‌ర్ణాట‌క‌లో త‌ప్ప మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా సీఎం పీఠాన్ని అదిరోహించిన దాఖాలాలు లేవు. ఏలాగైనా ఈ 2019 ఎన్నిక‌ల‌లోపు ద‌క్షిణ భార‌తంలో కాలుమోపాలని ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించ‌న‌ట్లుంది.
ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నేత‌లు కిష‌న్ రెడ్డి, కె.ల‌క్ష్మ‌ణ్‌లు… మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గిపోయిన ఆనంత‌రం పార్టీ అంత‌రంగిక వ్య‌వ‌హారాల‌కు దూరంగానే ఉంటున్న‌ట్లు స‌మాచారం. హిందూత్వ ఏజెండాను త‌న‌దైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నారు స్వామి ప‌రిపూర్ణ‌నంద . ఈ మ‌ధ్య కాలంలో బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన విష‌యం తెలిసిందే. త‌ర్వాత హైకోర్టు స్టే ఇచ్చిన త‌ర్వాత తిరిగి హైద‌రాబాద్‌కు చేరుకున్న ఆనంత‌రం పెద్ద ఎత్తున ర్యాలీతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అందులో బీజేపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు రాజ‌సింగ్, ఎన్‌.వి.ఎస్‌.ఎస్ ప్ర‌భాక‌ర్‌లు ప‌రిపూర్ణ‌నంద‌కు మ‌ద్ద‌తు తెల‌ప‌డం జ‌రిగింది. అందులో ప‌రిపూర్ణ‌నంద ఒక బ‌ల‌హీన వ‌ర్గాల(బీసీ)కు చేందిన వ్య‌క్తి. హిందుత్వ‌మ‌నే కాకుండా, వ‌చ్చే ఎన్నిక‌ల‌లో బీసీ కార్డును ఉప‌యోగించి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌నుకోవ‌డం కూడ క‌లిసోచ్చే ఆంశమ‌నే చెప్పాలి. దీంతో ద‌క్షిణ భార‌తంలో మ‌రో యోగి అదిత్య‌నాథ్‌గా రాబోయే ఎన్నిక‌ల‌లో తెలంగాణ‌లో బీజేపీ సీఎం అభ్య‌ర్థి ఖాయ‌మ‌య్యార‌ని ప్ర‌జలంద‌ద‌రు అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *