ఓటమిని అంగీకరించిన కేసీఆర్..?
అధికారంలో ఉన్న పార్టీ పై ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడటం సహజం. ఇందుకు తెరాస అతీతం కాదు. ముఖ్యమంత్రి లేదా పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తులు తమ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు తమ ఎమ్మెల్యే లను బాద్యుల్ని చేస్తూ కొత్త ముఖాల కోసం అన్వేషిస్తారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడ్డపుడు ఇలానే చేశారు. ఈ ఆనవాయితిని తిరగరాస్తూ కేసీఆర్ దాదాపుగా అందరు సిట్టింగ్ లకు సీట్లనిచ్చి సంచల నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ లకు స్థానం కల్పించడం వల్ల ప్రభుత్వం పై వ్యతిరేకత ఎమ్మెల్యే ల వల్ల కాకుండా ప్రభుత్వాధినేత వల్ల ఏర్పడిందని కేసీఆర్ పరోక్షంగా ఒప్పుకున్నట్టే. రెబెల్స్ బెడద తప్పదని భావించి దాదాపు గా అన్ని స్థానాల కు అభ్యర్థుల్ని ప్రకటించడం వల్ల నైతికంగా ఓటమికి తొలిమెట్టు పడ్డట్లే!