బాబ్లీ కేసు: బాబుకు ‘వరం’ కాదా?
తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు ఏకతాటిపై వచ్చిపోరాడుతున్న సమయంలో టి.డి.పిది ఏటువైపో తేల్చుకోలేని పరిస్థితి. కొన్ని రోజులు రెండు కళ్ళ సిద్ధాంతం, మరికొన్ని రోజులు కొబ్బరి చిప్పల సిద్ధాంతంను పట్టుకుని వున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజల మధ్యకు రావాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసిన కార్యక్రమం ఈరోజు తెలంగాణలో మళ్ళీ టి.డి.పి పుంజుకునేలా చేస్తుందని పలువురు విశ్లేషకులు బావిస్తున్నారు.
అప్పుడున్న పార్టీలన్ని కలసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ, ఈ ప్రాంతంలోనే కార్యక్రమాలు చేస్తూ, తెలంగాణ సెంటిమెంట్‌ను కనపరిచారు. కానీ, ఒక్క టి.డి.పి నాయకులు మాత్రం ఈ ప్రాంతంలో మాట్లాడలేని పరిస్థితులలో ఉండేవారు. సరైన సమయంలో సరైనటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ అది ఈ ప్రాంతం గురించే కానీ, ప్రాంతం వెలుపల, ప్రాంత ప్రజలకోరకు.
అదే 2010 సమయంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్టు గురించి అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని 40 మంది సభ్యులచే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత జైల్లో పెట్టారు కూడా. కానీ అప్పుడు అనుకున్నంత సానుభూతి ప్రజల్లో తీసుకురాలేకపోయింది. సరిగ్గా తెలంగాణ రాష్ట్రం వచ్చాక దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు మహారాష్ట్ర పోలీసులు.
తెలంగాణ రాష్ట్రం వచ్చి నాలుగేళ్ళు దాటిన తర్వాత ఒక దశలో తెలంగాణలో టి.డి.పి ఉనికి లేదనుకుంటున్న సమయంలో ఒక రకంగా ఇది మంచి అవకాశామనే అనుకోవచ్చు. టి.డి.పి డీలా పడిందనే సమయానికి మళ్ళీ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఒకరకంగా వెసులుబాటు అని చెప్పవచ్చు. రాబోయే ఎన్నికల్లో ఇది టి.డి.పికి చాలా కీలకంగా మారి, ఓటింగ్‌గా పెంచుకొడానికి అవకాశాలు ఎక్కవగా అగుపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో ఇది టి.డి.పికి సానూభూతిని తెచ్చిపెడుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.