బలమే బలహీనతా అవనుందా..!?
ఉద్యమంలో ముందున్న నాయకుడు హరీష్ రావు ఇప్పుడు రాజకీయాల విషయానికొచ్చేసరికి వెనుకంజ ఎందుకు వెస్తున్నారో ప్రజలకి అంతుపట్టడం లేదు. ఉద్యమ సమయంలో ముందు వరుసలో ఉండి నడిపించిన ట్రబుల్ షూటర్‌గా పిలువబడే నాయకుడు హరీష్ రావు.
తన నియోజకవర్గమైన సిద్దిపేటలో దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో ప్రసంగిస్తూ… ఈ జన్మకి ఇది చాలు.అంటూ ఇక రాజకీయాల నుంచి తప్పుకొవాలనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు అని బావోద్వేగంతో మాట్లాడారు. అయితే ఇది ఇప్పటి నుంచి కాదు. ప్రతి కార్యక్రమానికి తనకు ప్రజాదరణ ఈ విధంగానే ఉంటుంది. కానీ, ఇప్పుడే ఎన్నికల ముందే ఇలా ఎందుకు ప్రకటిస్తున్నడనేది అందరినీ అశ్చర్యానికి గురి చేసింది. సిద్దిపేటలో ఏ ఎలక్షన్స్ జరిగినా ఏకగ్రీవాలే ఎక్కువ అవుతుంటాయి. ఇందుకు పూర్వం సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏకగ్రీవాలే ఎక్కువ అవ్వడంతో టి.ఆర్.ఎస్ అధిక అధిక్యంను కనుబరుస్తుంది.
ఇలా ఏకగ్రీవాల వల్ల హరీష్ రావుకు లాభం కంటే, నష్టామే ఎక్కవనే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. ఒక రాష్ట్రా నాయకత్వాన్ని నడిపించాల్సిన నాయకుడు నియోజక వర్గానికి పరిమితమై ఉండటం అనేది కేసీఆర్‌కి, కేటీఆర్‌కి ఒక రకంగా ప్లస్ అవుతుందనే చెప్పవచ్చు. ఉద్యమ కాలంలో ఏ ఎన్నికలు వచ్చినా, హరీష్ రావే ముందుండేవారు. కానీ, ఇప్పుడు హరీష్ రావు ఒక నియోజకవర్గానికి పరమితమైపోతుంటే, కేటీఆర్ మాత్రం ఎన్నికల క్యాంపేయిన్ (గ్రేటర్ ఎన్నికల సమయంలో) మొత్తంను తన భాద్యతగా తీసుకుని వెళ్ళిపోయి, వారసత్వ పోరులో సీఎం రేసులో ముందుండేందుకేనని ఇదంతా జరుగుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా చూస్తుంటే తన బలమే బలహీనత అవుతుందేమో..!?