ఏపీలో ఎమ్మేల్యే సీటు ఖరీదు 25 కోట్లా.!?
తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఎన్నికలు ఒకే రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ, ఆ సెగ పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా తాకింది. ఇప్పటికే ఏ పార్టీకాపార్టీ తమ వ్యూహాలను రచించుకునే పనిలో ఉన్నాయి. తెలంగాణలో కొన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, నామినేషన్ కూడా వేస్తున్నారు. ప్రతిపక్షాలు పార్టీలలో కొన్ని కూటమిగా ఏర్పడి, ఎన్నికలలోకి వెళుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇప్పటి నుంచే మారుతున్నాయి. ఎవరి వ్యూహాలు వారు రచించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం ఉన్నందున అభ్యర్థులను నిశితంగా పరిశీలించే పనిలో ఉన్నాయి పార్టీలు. పోటీ చేసే అభ్యర్థులకు అర్థిక స్థోమత ఏ మేరకు ఉందనే దానిపై ఆరా తీస్తున్నాయట అయా పార్టీలు. సాధారణంగా ఒక అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసంగా 25 కోట్లకు పైమాటేనంటున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే, ప్రస్తుత ఎన్నికలలో అర్థిక బలం ఉంటేనే నాయకుడవుతాడనే ఆలోచనలను రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నట్టేనా..? ప్రస్తుత ఎన్నికలలో జన బలం కన్నా, అర్థిక బలమే నాయకత్వానికి సూచీనా..?