ఎన్నికల ప్రచారంః సెంటిమెంట్‌తోనా..? పథకాలతోనా..?
రాష్ట్రంలో ఎన్నికల సమయం అసన్నమైంది. ప్రతిపక్ష పార్టీలు, కూటములన్నీ ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాన్ని ప్రజా ఆశీర్వాద సభల పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. ఎట్టకేలకు ప్రతిపక్షాలు కూడా ప్రచారానికి సిద్ధమయ్యాయి. అయితే ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయం కేసీఆర్‌కు ఒక రకంగా షాక్‌నిచ్చినట్లే అయ్యింది. ప్రతిపక్షాలన్నీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గోంటున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా అందులో టీడీపీ కలవడంతో మరింత అందోళనకు గురైనట్లున్నారని అనుకుంటున్నారంతా కూడా.
ప్రచారం ప్రారంభించిన తర్వాత, మధ్యలో కొద్ది కాలంపాటు విరామం తీసుకున్న కేసీఆర్ తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ప్రచార ప్రసంగాలను కూటమి ఏర్పాటుకు ముందు, తర్వాత అని చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కూటమి ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల్లోకి పోవాలనుకున్న కేసీఆర్‌కు అదిలోనే అడ్డంకులు ఏర్పడింది. అదికాస్త చంద్రబాబు ప్రవేశం తర్వాత కేసీఆర్ ప్రసంగాలలో తేడా వచ్చిందనే చెప్పవచ్చు.
రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రసంగాలు చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ సెంటిమేంట్ ఉన్నచోట పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా తమ ప్రసంగాలున్నాయి. సెంటిమెంట్ లేని ప్రాంతలలో (ఖమ్మం, నకిరేకల్ ) ఆంధ్ర నాయకుల పెత్తనం అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలున్నాయి. అయితే ఏవరేన్ని ప్రసంగాలు చేసినా తుది తీర్పు ప్రజలదే కాబట్టి, వచ్చే ఫలితాలు వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే.