Bathuku (Life)

జ‌ననానికి ముందే మ‌ర‌ణామా..?

“అమ్మ స్త్రీ..!
ఆళి స్త్రీ.!!
అమ్మ‌ల‌ను గ‌న్నా అమ్మ స్త్రీ!!!”
అని ఒక క‌వి   అన్న మాట గుర్తు వ‌చ్చింది. ఎందుకంటే ఈ మ‌ధ్య కాలంలో చిట్టి తల్లులు ఎంద‌రో క‌నులు తేర‌వ‌కముందే, వారిని శాశ్వ‌త నిద్ర‌లోకి పంపించేస్తున్న‌ది లోకం. ప్ర‌తి రోజు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్క‌డో ఓ చోట‌ జరుగుతూనే వుంటాయి. పుట్టకముందే తల్లి కడుపులోనే శాశ్వతంగా చిదిమివేసే దౌర్భాగ్య స్థితి దేశంలో క‌న‌బ‌డుతుంటాయి. కొంత‌మంది త‌ల్లిదండ్రులు అమ్మాయి అని తేలియ‌గానే భూమిమీద కాలు మోపనీయడం లేదు. ఎందుకు?
కొద్ది కాలం క్రితం ఒక హాస్పిటల్లో జ‌రిగిన‌ ఘటనను ఆ అసుప‌త్రి న‌ర్సు వివ‌రాల‌ ప్ర‌కారంః
ఇద్దరు భార్యాభర్తలు పెళ్లయి ఏడు సంవత్సరాలు గ‌డిచాయి. అయిన‌ప్ప‌టికీ వారికి పిల్లలు లేకపోవడంతో తిరగని హాస్పిటల్ లేదు. కొంతకాలం త‌ర్వాత ఆ జంట‌కి సంతానం క‌లిగింది. తన భార్య ఒక‌ ఆడపిల్లకి జన్మనిచ్చిందని తెలిశాక ఆ తండ్రి తాకడానికి కూడా ఇష్టపడని ప‌రిస్థితి. మ‌రొపక్క అమ్మ‌త‌నం కొసం ఎన్ని రోజులు ఎదురు చూసిన‌ త‌ల్లి కూడ చివ‌రకి పాప ఆకలితో ఏడుస్తున్న కరునించలేద‌ని అక్క‌డున్న‌టువంటి న‌ర్సు చెప్పారు.
ఇలాంటివి ఒక‌టేమిటి చాలా జ‌రుగుతున్నాయి. త‌ర్వాత ఏం చేయ‌లేని స్థితిలో పెంచుకుంటారు. అయితే ఇక్క‌డ ఒక‌టి గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే… ఆ అమ్మాయిపై వివ‌క్ష అనేది కొన‌సాగుతుంది. ఇది చాలా గ్రామాల‌లో మ‌నం చూస్తునే వుంటాము. కానీ ఆ అమ్మాయిలే త‌రువాత కాలంలో అబ్బాయిలతో పాటుగా అన్ని రంగాలలో ప్రతిభ చాటడంలో ముందు వ‌రుస‌లో ఉంటారు. (అది వేరే విష‌యం.)
అమ్మాయే వద్దు… అబ్బాయి ముద్దు.
శిశువును గ‌ర్భంలోనే చంపుకునేందుకు చాలా ర‌కాల కారణాలు ఉన్నాయంటున్నారు. అందులో ముఖ్యంగా డబ్బు లేకపోవడం వలన పోషిచలేని స్థితి. తల్లిదండ్రులకు ఆడపిల్ల భారమ‌నే ఒక విధ‌మైన ఆలోచ‌న‌లతో పాటు, ఆడపిల్ల అయితే పెళ్లి త‌దిత‌ర స‌మ‌స్య‌లు శిశు హ‌త్య‌ల‌కు కార‌ణాల‌వుతున్నాయి. ఇదిలా ఉండగా… ఈ శిశు హ‌త్య‌లు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల వాళ్ళు ఉండటం, అందులోనూ చదువుకున్న వాళ్ళే ఈ అఘాయిత్యలకుపాల్పడటం గమనార్హం.
అమ్మాయిల రేషియో తగ్గిపోతుందా?
భార‌త దేశంలో అమ్మాయిల రేషియో దినదినానికి తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరంలో 2 లక్షలకు పైగా ఆడపిల్లలు చనిపోతున్నారు. లింగ వివక్ష భేదం 1991 నుండి ఇప్పటికి కొనసాగుతుంది. అబార్షన్ చేయించడం వలన 63 బిలియన్ మంది ఆడపిల్లలు మన జనాభా లెక్క‌ల్లో లేనటువంటి ప‌రిస్థితి. 100 సంవత్సరాల్లో 2.4 మిలియన్ల అమ్మాయిలుగా పుట్ట‌డం వ‌ల‌న చనిపోయారనే అశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డైయ్యాయి. ల్యాండ్‌సంట్ గ్లోబ‌ల్ హెల్త్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం సుమారు 2 లక్షల 39వేల మంది అమ్మాయిలు అందులో 0.5% సంవత్సరం లోపు వాళ్ళు చనిపోయారు.
కంటేనే అమ్మయి పోతుందా….
“కంటెనే అమ్మని అంటే ఎలా!కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా!!
ప్రతి తల్లికీ మమకారం పరమార్థం అంటాము.కానీ ఆ మమకారాన్ని కారు చీకట్లో నెట్టేస్తుంది ఆ అమ్మ.”
అరచేతిని వదిలిపెట్టకుండా అదిమిపట్టుకొని అమ్మ అడుగుజాడల్లో నడవాలని ప్రతి బిడ్డ అనుకుంటుంది కానీ ఆ అడుగులతోనే తనని అనాథ ఆశ్రమాల వైపో, చెత్త కుప్పల వైపో శాశ్వతంగా మ‌ళ్ళించే వాళ్ళు లేక‌పోలేదు. వారిని ప‌ట్టించుకునే వారు లేక, వారికి సరైన ఆహారం లేక ఆరోగ్యం పాడయ్యి చాలా మంది పిల్లలు తల్లిదండ్రులుండి అనాథలుగా మరణిస్తున్నవారు ఉండ‌టం దేశ వెన‌క‌బాటుతనానికి సాక్ష్యం.
శిశు సంరక్షణ పథకాలు:
ఆడపిల్ల సమస్య అనుకుంటున్న ప్ర‌తి త‌ల్లిదండ్రుల‌కి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింది. అయితే వాటిని ఎలా స‌ధ్వినియోగం చేసుకోవాలో కూడా తెలియ‌ని ఘోర‌మైన‌ స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నారు. భారత ప్రభుత్వం గర్ల్ డెవలప్మెంట్ మిషన్ అనే పథకం ప్రారంభించి అందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన ప‌థ‌కంతో పాటు ఆడపిల్లలని కాపాడేందుకు ఆడపిల్ల యోగక్షేమాలు కోసం శిశు విహార్నీ, ఇంతేకాకుండా ధనలక్ష్మి పథకం 2008 లో నుండి అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అధ్వ‌ర్యంలో ఆడపిల్లల‌ పెళ్ళి స‌మ‌యంలో తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి ప‌థ‌కం ద్వారా సుమారు లక్ష రూపాయలను అందజేస్తుంది. కనీసం ఇలాంటి పథకాల వల్ల అయిన ఆడపిల్లల వృద్ధి పెరుగుతుందనే భావ‌న‌లో ఈ స్కీంలు ప్ర‌వేశ‌పేట్టారు.అయిన‌ప్ప‌టికీ అడ‌పిల్ల‌ల‌ను పురిటిలోనే చిదిమివేసే ఎన్నో కుటుంబాలు ఇప్ప‌టికీ ఉండ‌టం దేశ ద‌యానీయ ప‌రిస్థితి సాక్ష్యాత్కారం.
ఇదిలాగే కొన‌సాగితే మాన‌వ మ‌నుగ‌డే సాధ్యంకాని ప‌రిస్థితి త‌లేత్తే అవ‌కాశాలున్నాయి. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల్లో ఇంకా అవ‌గాహన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి. మున్ముందు పున‌రావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాలతో పాటు ప్ర‌జ‌ల‌ పైన ఉంది.

                                                                   -ఇంట‌ర్న్‌షిప్ వింగ్‌, ఏపి కాలేజ్ ఆప్ జ‌ర్న‌లిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *