అందినా.. ఈ ’ద్రాక్ష‘లు తియ్యనే…!
హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా మారుస్తానని చేప్పుకునే నాయకులను మనం చూశాం. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ప్రపంచ నగరం అంటే ఐటీ అనో, లేక మరోటో చెప్పుకుంటూ పోతుంటారు. అయితే కొన్ని దశాబ్ధాల క్రితమే మన నగరానికి ఆ పేరు ఉంది. అది కూడా కృత్రిమంగా తయారు చేసే వస్తువులో లేక ఇతర సేవా రంగంలోనో కాదండోయ్. ప్రకృతి సహజంగా పెంచే తోటలకి అని ఎంత మందికి తెలుసు. మన నగరాన్ని ‘సిటీ ఆఫ్ గ్రేప్’ గా దశాబ్ధాల క్రితమే ప్రపంచ ప్రసిద్ధి చేందింది.
ఒకప్పుడు నగరం చుట్టూ ద్రాక్ష తోటల (ప్రకృతి) అందంతో పర్యాటకులను ఆకర్షించేది. అది కాస్త రియల్ ఎస్టేట్ ప్రభావంతో ఆ తోటలను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఆ అవకాశం తిరిగి కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ద్వారా నగర ప్రజలకు కలిగింది. ఈ యూనివర్సిటీ దాదాపు 7 ఎకరాలలో 59 రకాల ద్రాక్షపై పరిశోధనను చేస్తూ సాగు చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఉద్యానవన విశ్వవిద్యాలయం 1969 సంవత్సరంలోనే అనాబ్ – ఈ సాహి అనే ద్రాక్షను సాగు చేసి ఎకరానికి 105 మెట్రిక్ టన్నుల హెక్టార్లు పండించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ పరిశోదనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలా 1975-76 లో అల్ ఇండియా కో-ఆర్డినేట్ ఫ్రూట్ ఇంఫ్రూమెంట్ ,2013 నుండి ఏ.ఐ.సి ( ఆర్పీ ఆల్ ఇండియా కో-ఆర్డినేట్ రిసెర్చ్ ప్రోగ్రాం) అధ్వర్యంలో పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఈ సాగు చేస్తున్న తోటలను ఇప్పటి వరకు సందర్శకులకు అనుమతించలేదు. గత ఏడాది నుండి నగర ప్రజల సందర్శనార్థం అవకాశం కల్పించారు. అందులో భాగంగానే మా తెలుగూస్ టీం సందర్శించడం జరిగింది.
హార్టికల్చర్ యూనివర్సిటీ పరిశోధనాధికారిణి విజయ తో మాట్లాడి తెలుసుకున్నారు.
ప్రః ద్రాక్షను ఎక్కడ సాగు చేస్తారు .. ?
జః ద్రాక్ష పళ్ళను చూడగానే నోరు ఊరుతుంది కానీ అవి ఎలా ఎక్కడ ఎలా పండిస్తారో ఎవ్వరికి తెలియదు. ద్రాక్ష పళ్ళను ఎక్కువగా ఎర్ర రేగడి నెలలో సాగుచేస్తారు. మన దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర,కర్ణాటక,మధ్యప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్,పంజాబ్,హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో ఎక్కువుగా సాగు చేస్తారు ..
ప్రః ద్రాక్ష పళ్ళ తోటల సాగుకు ఎంత ఖర్చు అవుతుంది?
జః మార్కెట్ లో దొరికే థామ్సన్ సీడ్ లెస్ , బ్లాక్ బ్యూటీ , ఫ్లడ్ లెస్ రకాలు మనందరికీ తెలిసినవే ..కానీ రాజేంద్ర నగర్ లో దేశంలో సాగు చేసే 59 రకాలు పంటలను ఒకే చోట సాగు చేస్తున్నారు .దాదాపు 7 ఎకరాలలో ఎకరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న లాభాలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి .
ప్రః ద్రాక్షలో ఎన్ని రకాలు ఉంటాయి .. ?
జః ద్రాక్షలో తినే రకాలతో పాటు వైన్ మరియు జ్యూస్ మరియు రెసిమ్స్ రకాలను ప్రాధాన్యం ఇస్తుంటారు .
జ్యూస్ రకాలు ..
మంజరి మెడికా హెచ్ -516 , ఏ – 18-3 , ఇటాలియా రెసిమ్స్ రకాలు .. కిస్ మిస్ రోజా వీస్ , కిస్ మిస్ క్రోనీ
వైన్ మరియు తినే రకాలు ..
రెడ్ గ్లోబ్ ఫ్లేమ్ సీడ్ లెస్ , థామ్సన్ సీడ్ లెస్ . మాణిక్ కామెల్ , మొర్బిన్ సీడ్ లెస్ , నానా పర్పుల్
ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానికి పద్ధతుల్లో ఈ ద్రాక్ష తోటలను సాగు చేస్తున్నారు .. ద్రాక్ష తోట పరిశోధనల వలన రైతులకు ఎక్కువగా లాభం ఉంటుందని ద్రాక్ష పండించే రైతులకు వర్క్స్ షాప్స్ నిర్వహించి అవగాహనా కల్పిస్తున్నారు .. అలాగే విద్యార్థులకుగిడెన్స్ ఇస్తున్నారు .. ఇంటి పెరట్లో పెంచుకోవడానికి కూడా మొక్కలను కొనుగోలు చేస్తున్నారు.
ప్రః పిక్ యువర్ ఓన్ ఫ్రూట్ …?
జఃపిక్ యువర్ ఓన్ ఫ్రూట్ అనే ఆప్షన్ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలలో అమలులో ఉంది. ఇప్పుడు మన దేశంలో ఇక్కడ హైదరాబాద్ లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విద్యాలయంలో ద్రాక్ష పళ్ళ ఉత్సవం ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
-సౌమ్య.పి