అమెరికాకు పర్యాటకమే శాపమా.!?
ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. అది ఎప్పుడో, ఐటీ సెక్టార్ ప్రారంభమైనప్పుడే జరిగిపోయింది. కానీ, విచిత్రంగా “ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి” అన్న సామేత ఇప్పుడు అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. చైనా దేశంలోని ఊహన్ నగరంలో పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అగ్రరాజ్యంలో విలయతాండవం చేస్తుంది. అమెరికాలో రోజుకు వెేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పలు రంగల్లో ముందంజలో ఉన్నటువంటి ఈ దేశం కోవిడ్-19ని వైరస్ వ్యాప్తిని ఎందుకు తగ్గించుకోలేకపోతుంది. అన్న ప్రశ్నలు సగటు అమెరికన్ సీటిజన్ ముందున్న సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగులుతున్నాయి.
ప్రతి విషయంలో తమ తర్వాతే,మిగిలిన దేశాలు అనే విర్రవీగే అమెరికా భారత్ పై ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకు..? ఆ పరిస్థితి నెలకొంది. ఏమిటా పరిస్థితులని అడిగి తెలుసుకునేందుకు అక్కడున్న ప్రవాస భారతీయులను సంప్రదించారు తెలుగూస్.కామ్ టీమ్.
సాధారణంగా అన్ని దేశాల నుండి అమెరికాకు వలసలు జరుగుతూనే ఉంటాయి. అందులో న్యూయార్క్ సిటీ(Travel Hub)కి పర్యటించేవారు మరీ ఎక్కువగా ఉంటారు. కాబట్టి దీని ప్రభావం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే అక్కడ ఒక కేసు గురించి తెలుసుకునే లోపే, వెయ్యి కేసులు బయటపడుతున్నాయి. ప్రాథమిక దశలో లాక్ డౌన్ నిర్వహించక, ఎలా కట్టడి చేయ్యాలో తెలియలేదు. కానీ తర్వాత చాలా జాగ్రత్తగా, వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ కూడా పాటిస్తున్నారు.
భారత దేశంతో పోలిస్తే, అమెరికా జనసాంద్రత చాలా తక్కువగా ఉన్నటువంటి దేశం. అమెరికాలోని న్యూయార్క్ సిటీకి డిసెంబర్ నుండి జనవరి దాకా చాలా పర్యాటకులు వచ్చారు. అందులో చైనా వాళ్ళు భారత్ కన్నా, అమెరికాకి ఎక్కువ వస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఆర్థిక కార్యకలాపాలను, ప్రజల శ్రేయస్సును బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ శుభ్రత, భౌతిక దూరం సరిగ్గా పాటించలేకపోవడం వల్ల ఇంతలా ఈ వైరస్ వ్యాప్తి చెందిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఈ వైరస్ కారణంగా మరణించిన వాళ్ళలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం ఒక కారణం. అది కాకుండా గుండెపోటు, ఆస్తమా, డయాబెటిస్ లాంటి పలు వ్యాధులతో అవస్థలు పడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ మరణాలు సంభవించాయి. దీని ప్రభావం ఐటీ రంగం పైన కూడా పడుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోయే అవకాశం కనిపిస్తుంది.
చివరగా, అగ్రరాజ్యమైన అమెరికా, భారతదేశం నుంచి హైడ్రాక్సీక్లోరొక్విన్ మందులను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని అడగగా, దానికి సమాధానంగా, “ఇక్కడ మందులు తయారుచేసే అనుమతి ఉన్నప్పటికీ, ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందువల్ల ఆ మందులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వం మాత్రం కరోనాని అరికట్టాలని గట్టిగా ప్రయత్నిస్తుందని” చెప్పుకొచ్చారు.
-సుమాంజలి.కె, విద్యార్థిని
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.