’నిశ్శబ్దం‘ పై క్లారిటీ ఇచ్చిన కోన వెంకట్
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ’నిశ్శబ్దం‘ రీలిజ్ కి సిద్దమైంది. లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకొలేని ఈ సినిమాని థియోటర్ లోనే విడుదల చేస్తానని ఆ చిత్ర దర్శకుడు కొన వెంకట్ స్పష్టం చేశారు. ఈ చిత్రం స్త్రీ కేంద్రంగా సాగుతుంది. నిశ్శబ్దం చిత్రాన్ని వెబ్ ప్లాట్ ఫాంల ద్వారా విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.
లాక్ అవుట్ లను వరసగా పొడిగించటం వల్ల ఈ పుకార్లు ఊపందుకున్నాయి. ఈ ప్రచారానికి తెర దించాలని చిత్ర దర్శకుడు భావించారు. లాక్ డౌన్ ఎత్తి వేసిని తర్వాత థియోటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నట్లు స్పష్టం చేశారు.
-తెలుగూస్ ఫిలిం బ్యూరో