బార్బర్స్: తమ తలను పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా..?
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో లాక్ డౌన్ షరా మాములే. కానీ అక్కడున్న ప్రజల పరిస్థితులే చాలా దయనీయంగా తయారయ్యాయి. ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు, కార్పోరేట్ సంస్థలు కాసేపు విరామం ప్రకటించినట్లు కనిపించవచ్చు. ఏటోచ్చి చిన్న చిన్న పనులు చేసుకునే వారికి, రోజు వారి కూలీలకి, కుల వృత్తులు చేసుకునే ప్రజలకే నష్టాలు, ఆపై ఇబ్బందులు తప్పట్లేదు. ప్రధానంగా కుల వృత్తులు చేసుకునే బార్బర్ లకు చాలా నష్టాలు తెచ్చిపెట్టిందనీ, ఆ కారణంగా చాలా ఇబ్బందులు తప్పట్లేదని వాపోతున్నారు. ప్రస్తుత ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సడలింపులు విదించినప్పటికీ, సెలూన్ దుకాణాలకు రావడానికి జనం జంకుతున్నారు. ఈ మధ్య కాలంలో బోఫాల్ లో ఒకే టవల్ తో పన్నెండు మందికి కటింగ్, షేవింగ్ చేయడం ద్వారా వారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో దేశమంతటా హెయిర్ సెలూన్ కు వెళ్ళాలంటే జంకుతున్నారు. ఇదే విషయంపై ఒక బార్బర్ కుటుంబాన్ని మా తెలుగూస్ టీం సంప్రదించినప్పుడు వారి బాధను పంచుకున్నారు.
బార్బర్ వృత్తిపైనే ఈ కుటుంబం మొత్తం జీవిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు హెయిర్ సెలూన్ తో పాటు, బ్యూటిపార్లర్ లు నడిపిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు ఎమ్.బి.ఎ., మరోకరు డిగ్రీ పూర్తి చేశారు. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిన కుల వృత్తినే ఉద్యోగంగా ఎంచుకున్నారు. ’’కరోనాకు ముందు ప్రతి రోజు రూ. 500/- నుంచి రూ.600/- సంపాధించే వాడిని. అమ్మ శుభకార్యలకు ఫేషియల్ చేసేది. తాను కూడా సంపాధిండంతో కుటుంబంలో ఎలాంటి లోటు లేకుండా ఉండేది. ఈ సమయంలో ఎవరు రాకపోవడంతో ఒకేసారి రోడ్డున పడ్డట్టయ్యింది. కరెంట్ బిళ్ళులు కట్టలేకపోతున్నాము. ఇంటి కిరాయిలు చెల్లించలేకపోతున్నాము. తీవ్ర అవస్థలు పడుతున్నాము. అయినా మా వృత్తి చేసేటప్పుడు అందరిని ముట్టుకుని చేయ్యాల్సిందే కదా. భౌతిక దూరం పాటించడం చాలా కష్టతరమైంది. షాపుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అవే టవల్స్ ఉపయోగిస్తాము. ఒక్కొక్కరికి ఒక్కో టవల్ వేయాలంటే, మా దగ్గర వందల టవల్స్ ఉండాలి. వచ్చిన ప్రతి కస్టమర్ కి ఉపయోగించిన టవల్ తో మళ్ళీ చేయడం ఎవరికీ ఎముందో అన్న భయం వారే కాదు మేము కూడా అలాంటి భయాలకే గురౌతున్నాము. కత్తెరలకు, దువ్వెనలకు గడ్డం చేయడానికి వాడే పరికరాలకు కరోనా వ్యాధి వస్తుందని విస్తృతంగా ప్రచారం అవ్వడంతో మా దూకాణాలు తెరచిన మూసినట్లే కనిపిస్తున్నాయి మాకు. చిల్లీ గవ్వ కూడా రావడం లేదు. మా జీవనోపాధే ఇది.
ప్రస్తుతం నమ్మకమైన, తెలిసిన వారికే కటింగ్, షేవింగ్ చేయాల్సి వస్తుంది. వర్క్ ఎట్ హెం తో పాటు, వర్క్ ఫ్రం కూడా చేస్తున్నాము. తగు జాగ్రత్తాలు పాటిస్తూనే మా పనులు చేసుకుంటున్నాము. మా దగ్గరి నుంచి ఒక కత్తెరను మాత్రమే వెంట తీసుకెళ్ళే పరిస్థితి వచ్చింది. టవల్స్ దువ్వెన అవసరమైన సామాగ్రిని కస్టమర్ల ఇంటిలోనే ఉండేలా చూసుకుంటున్నాము. మా బాధని చూసి కొంతమంది నవ్వుతున్నారు. మరికొంతమంది బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో సడలింపులు విధించిన కూడా క్షౌరశౌలకు ఎవరు రావడం లేదు. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎవరికి వారే ఎలక్ట్రానిక్ మెషీన్స్ తో ట్రిమ్ చేసుకోవడం, కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు హెయిర్ కట్ కూడా ప్రయత్నిస్తున్నారు. నిత్యవసరాల వస్తువులు అందినప్పటికీ కొన్ని రోజుల వరకే పరిమితం అవుతుంది. ఏదేమైనా కరోనా వచ్చి మా వృత్తిపై గట్టిగానే దెబ్బ కొట్టిందని‘‘ బాదపడుతూ చెప్పారు.
ఈ మధ్య కాలంలో చికెన్ పై వచ్చిన రూమర్స్ వ్యాప్తి చెందుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చికెన్ తింటున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ రకంగా ఇక్కడ కూడా ఏవరైనా సెలబ్రేటీలో లేక రాజకీయ నాయకులో ఇలాంటి వాటికి చెక్ పెట్టినట్లయితే, మా జీవితాలు మేరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-జీవన్, విద్యార్థి.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.