HyderabadTelangana

ఈ గుంత ప్రమాదానికి నెలవా..?

సికింద్రాబాద్: సికింద్రాబాద్(ఈస్ట్) మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డుపై తవ్విన గుంతలను పుడ్చక పోవడం వలన వాహనదారులు  ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మెట్రో స్టేషన్ నుంచి జేబీఎస్ వెళ్ళే మార్గంలో కొత్తగా రోడ్డు నిర్మాణం జరిగింది. రోడ్డు నిర్మాణం కంటే ముందు చేపట్టాల్సిన పనులు, రోడ్డు నిర్మాణం పూర్తి అయిపోయాక  చేపట్టడం వలన కొత్తగా వేసిన రోడ్లు గుంతలుగా మారుతున్నాయి . రోడ్డు నిర్మాణ అధికారులకు, పైపు లైన్ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణమని అనుకుంటున్నారు బాటసారులు. తీసిన గుంతలను పుడ్చకుండా అలాగే వదిలేయడం జరిగింది.

రాబోయే వర్షకాలంలో ఈ గుంతలు నీటితో నిండిపోయి, వాహనదారులకు కనిపించకుండా మారిపోతాయి. చేతులు కాలాక, ఆకులు పట్టుకునే పరిస్థితులు తలేత్తకముందే, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని గుంతలు పూడ్చినట్లయితే, జరగబోయే ప్రమాదాలను నివారించవచ్చనే అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

-తెలుగూస్ సిటీ బ్యూరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *