తింటే… ఆరోగ్యం..! పట్టుకుంటే ఆనారోగ్యమాయే.!? ఎలా..?
ప్రపంచ దేశాలని గజగజలాడిస్తుంది కోవిడ్-19. ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తంగా లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని దేశాలు ప్రత్యామ్నమయం వైపు చూస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం ఇతర మార్గాలను అన్వేషించడంలో నిమగ్నమయ్యాయి. కరోనా నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చేసి, తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ, ప్రతిరోజు తమ పొట్టకూటి కోసం ఇంటింటికి తిరిగి, పండ్లు అమ్ముకునే వారు, చిన్న చిన్న పండ్ల దూకాణాలు పెట్టుకున్న చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. అవుతున్నారు. ప్రస్తుతం వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అప్పటికి మార్పులు ఎలా మారాయో తెలుసుకునే ప్రయత్నంలో మా తెలుగూస్.కామ్ టీం వారిని సంప్రదించారు.
పెద్దపల్లి జిల్లా మంథని కార్పొరేషన్ కు చెందిన హఫీజ్ అనే వ్యాపారి పండ్లు అమ్ముకొంటు జీవనము సాగిస్తున్నాడు. ఈ మద్య కాలంలో కొన్ని నిత్యావసర వస్తువులకు సడలింపు ప్రకటించటంతో దాదాపు రెండు నెలలు తరువాత చిన్న చిన్న పండ్ల దుకాణాలను తెరిచారు. లాక్ డౌన్ నేపథ్యంలో చాలా నష్టపోయామని వాపోయారు. ప్రజలు ఎవరు కూడా ఇంతకు ముందులా కొనటం లేదు. పండ్లు కోనడం ద్వారా కరోనా విస్తరింస్తుందనే అపోహతో ఎవరు కొనడంలేదు. దాంతో అవన్నీ కూడ పాడైపోతునాయని ఆ షాపు యజమానులు వాపోతునారు.
ఈ వైరస్ కారణంగా సీజన్లో అమ్ముకొనే పళ్ల గిరాకీ బాగా తగిపోయింది. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడానికి రవాణా చార్జీలు కూడా పెరిగి పోయాయి. లాక్ డౌన్కు ముందు కొబ్బరి బోండాలు అమ్మేవారు లాక్డౌన్ తరువాత మూడు శాతం పెంచేసారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కొనే వారు లేకపోవడంతో పళ్ల షాపు యజమానులు తీవ్ర నష్టాలబారీన పడుతున్నామని వెల్లడించారు. లాక్డౌన్ కు ముందు డెబ్బయి శాతం వరకు గిరాకీ ఉండేదని లాక్డౌన్ తరువాత ముప్పై శాతానికి పడి పోయిందని చెప్పారు. ఇప్పటికైన ప్రభుత్వం చిన్న వ్యాపారులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు.
-స్రవంతి, విద్యార్థిని.