దుర్గాంధంతో “బంధం” సురక్షితమేనా..?
పదిహేను సంవత్సరాలు, నూట ముఫై కాలనీలు ఎన్నో కుటుంబాలు జీవిస్తున్న ఆ ప్రాంతంలో సాధారణమే అనిపించే సమస్యే. కానీ, దాని వల్ల జరిగే పరిణామాలు అంత ఇంత కాదు. ఎన్నో ఇబ్బందులు, మరేన్నో సమస్యలు. అదేంటో తెలుసుకుందామా..? ఆ సమస్యే జవహర్ నగర్ డంపింగ్ యార్డు.
ప్రతి ఒక్కరు ముఖానికి మాస్క్ ఉపయోగించాలి. మాస్క్ లేకపోతే, బయటకి రావద్దు లాంటి మాటలు సాధారణ ప్రాంతాలలో, టీవీలలో , ఇతర సామాజిక మాధ్యమాలలో తరచూ వింటూనే వున్నాము ఈ మధ్య కాలంలో. కోవిడ్-19 కి ముందు ఈ ఆంక్షలు లేవు. కానీ, వారికి అవసరమయ్యాయి. ఎంతో కాలంగా బయటకు వెళ్తున్నారంటే వారు ముఖానికి గుడ్డ కట్టుకోవాల్సిందే. ఇంటి నుంచి కాలు బయటకు పేడితే చాలు దుర్గంధం. కేవలం అక్కడున్నటువంటి డంపిగ్ యార్డ్ వల్లే. ఒకటి కాదు… రెండు కాదు… పదిహేను సంవత్సరాల నుంచి ఆ ప్రాంతం పడుతున్న బాధలను పట్టించుకునే నాథుడే లేరు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. కానీ, వారి సమస్య తీవ్రత మాత్రం అలానే వుంది. ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే, అక్కడున్న వారి వ్యథను గుర్తించిన వారిమవుతాము.
మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మయిగూడలోని జవహర్ నగర్ వాసులు నిత్యం డంపింగ్ యార్డ్ తో సతమతమవుతున్నారు. వారికి రోజువారి జీవనం సాగాలంటే, ఆ సమస్యను తట్టుకోవాలి కానీ, దాని నుంచి బయట పడే మార్గాన్ని అన్వేషించలేదు ఇప్పటి వరకు. ఆ ప్రాంతంలో ఏర్పరచుకున్న స్థిర నివాసం వారిని దూరం చేయనీయకుండా చేసింది. దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఆ ప్రాంతంతో ఏర్పరచుకున్న బంధం వారిని బయటకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ముఖానికి మాస్క్ తప్పనిసరి చేసింది వారికి.
ఒక కాలనీయో, రెండు కాలనీలో కాదు మొత్తంగా 130 కాలనీల ప్రజలకు ఇది సమస్యగా మారింది. దీని వల్ల “కలుషితమవుతున్న బోరు నీళ్ళు తద్వారా చర్మ వ్యాధుల సమస్యలు రావడం వల్ల ఇంట్లో బోరు ఉన్న వాడుకొలేని పరిస్థితి నెలకొందని బాధపడుతున్నారు. రోజు తప్పించి రోజు వచ్చే నల్ల నీరు ఒకరోజు రాకపోతే నీళ్ళకు తీవ్ర ఇబ్బంది పడుతున్నమని తమ బాధను వెలిబుచ్చారు. కాలనీ వాసులు డంపింగ్ యార్డ్ చుట్టుప్రక్కల చెట్లు, చెరువులు పరిసరలు కలిషితమై దోమలకు ఉత్పత్తి కేంద్రంగా మారిందని, సాయంత్రం 6గంటలకు దోమలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామ”న్నారు.
ఇటు డంపింగ్ యార్డ్, అటు దోమల వలన చిన్న పిల్లలకు వాంతులు, విరేచనాలు, పెద్దలకు లివర్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు జవహర్ నగర్ వాసులు. ఈ డంపింగ్ యార్డ్ పరిష్కారం కోసం ప్రభుత్వమే చోరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్నారు
– స్వాతి.టి, విద్యార్థిని.