Bathuku (Life)

కోవిద్ కాలం లో క్షురకులు: తాకకుంటే… తనువు చాలించాల్సిందేనా..?

మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టు- ఆధునిక సెలూన్ల, బ్యూటి పార్లర్ల దెబ్బకు విలవిల లాడుతున్న నాయీ బ్రాహ్మణుల(క్షురకుల) పై కోవిద్-19 తన ప్రతాపం చూపించింది. మనిషిని మనిషి తాకితే  ఈ వ్యాధి  సోకుతుందన్న భయం కారణంగా, ఎవరూ వీరి సేవలను అందుకోవటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కోనసాగితే, చేనేత కార్మికుల లాగా వీరు కూడా ఆత్మహత్యల వైపు చూడవచ్చు. ఈ లోగా ఆకలి చావులే హరించవచ్చు.
భారత దేశం లో వృత్తుల మీద ఆధారపడి పనిచేస్తున్న కులాలు అనేకం.  అందులో ఒకటి నా యీ బ్రాహ్మణ (క్షురక) కులం. ఇప్పుడు వీరి వ్రుత్తి అంతరించి పోయే ప్రమాదం ఉంది .1990 ప్రపంచీకరణ తరువాత విదేశీ పెట్టుబడులు పెరిగి ఆధునీకరణ  పేరుతో  బ్యూటీ సెలూన్స్ ,కొత్త కొత్త విదేశీ సెలున్స్ ,బ్యూటీ పార్లర్స్  వివిధ రకాల కొత్త కొత్త ఫ్యాషన్ సెలూన్స్ రావటం వల్ల అనేక మంది నాయీబ్రాహ్మణులను  లను ఆర్థికంగా దెబ్బతీశాయి . పైసలుండి పని తెలియని వాళ్ళు సెలూన్లు పెడితే, అందులో వీరు కూలి వారిగా పనిచెయ్యాల్సి వచ్చింది.
ఇప్పుడు కరోనా వలన అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. 1990 ముందు గ్రామాల్లో ప్రజలు వీరి దగ్గర క్షవరం    చేయించుకొని నెలకో 6 నెలలకో తగిన డబ్బులు ,   ధాన్యాలు ఇచ్చేవారు ఎప్పుడు ఐతే సెలున్లు వచ్చాయో వారి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది.  ఒక వ్యక్తి నీ తాక కుండా  పని చేయలేరు. ఫలితంగా వీరి దగ్గరకు రావటం లేదు.
గ్లోబలైజేషన్ వల్ల  ఈ  వ్రుత్తే కాదు,  అనేకం దెబ్బతిన్నాయి. కానీ, క్షురకులు మాత్రం  ఏదో మేరకు నిలదొక్కుకుని, తమ కుటుంబాలను పోషించుకోగలగుతున్నారు. అందుకు కారణాలు రెండు. ఒకటి: వీరు  ఈ పనితో పాటు, శుభకార్యాలలో మంగళవాయిద్యాలు కూడా వాయిస్తారు.  రెండు: అలాగే చిరు పెట్టబడులు పెట్టి తాము కూడా చిన్నచిన్న సెలూన్లు నెలకొల్పుకోగలిగారు. అయితే పూర్తిగా లాభాలు గడించే స్థాయికి మాత్రం వెళ్ళేదు.
నిజమే. తాకితేనే కానీ, అందించలేని సేవ వీరిది. వైద్యులూ, నర్సులూ కూడా తాకి సేవలు అందించాలి. వారికి  ఈ కోవిద్ కాలంలో ఆదరణ పెరిగింది. కొత్తగా నియామకాలను కూడా ఆసుపత్రులు చేపట్టాయి. అలాంటప్పడు నాయీబ్రాహ్మణుల సేవలను అందుకోవటానికి ఇబ్బంది ఎక్కడవుంది?  వైద్యులు ‘వ్యక్తిగత భద్రతా సామాగ్రి’ (పిపిఇ) ని ధరించి సేవలందిస్తున్నారు. ఈ తరహా సామాగ్రిని  వీరూ ఉపయోగించుకోవచ్చు.
అయితే ఇచ్చే వారెవరు? ప్రభుత్వమే ఇందుకు ముందుకు రావాలి. కోవిద్-19 కాలంలో వీరికి ఈ తరహా భద్రతా సామాగ్రిని అంద చెయ్యాలి.
జి. యాకాంబ్రం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *