FilmsNewsips

దేశానికి సైనికుడయినా, తల్లికి కొడుకే..!


దేశంలో కుటుబాన్నీ, కుటుంబంలో దేశాన్నీ చూపించగలమా? చూపించేస్తున్నారు తెలుగు దర్శకులు. కంచే, గగనం, రోజా, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా,సరిలేరునీకేవ్వరు లాంటి అర్మీ చిత్రాలు అలాంటివే.


రాధ మోహన్ దర్శకత్వంలో వ‌చ్చిన ‘గ‌గ‌నం’ 2011 లో తెర పైకి వచ్చింది. అక్కినేని నాగార్జున ఇందులో కమాండో పాత్ర పోషించారు. సినిమా మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అందోళన కనిపిస్తుంది. ఉగ్రవాదులు ఒక విమానాన్ని హైజాగ్ చేసి, యూసఫ్ ఖాన్ అనే ఉగ్రవాదిని విడుదల చేయమని ఆంక్షలు పెట్టి నడిపిస్తుంటారు. మొత్తం సినిమా దాని చుట్టే నడుస్తుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె(2015) సినిమాలో వరుణ్ కొణిదెల సైనికుడి పాత్రలో కనిపిస్తారు. ప్రధానంగా 1930 బ్రిటిష్ కాలంలో జరిగిన నాజీ దళాల రెండో ప్రపంచ యుద్దాన్ని చూపించారు. అంతేకాకుండా కుల, మతాలను అడ్డుగోడలుగా పెట్టుకొని జీవిస్తున్నాం అనే అంశాన్ని తీసుకుని సమాంతరంగా కథను నడిపించారు. దాంతో పాటు చిన్న ప్రేమ కథను చూపించే ప్రయత్నం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా(1992) సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటీనటులుగా అరవింద్ స్వామీ, మధు మంచి పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఉగ్రవాదం, మానవత్వానికి, ప్రేమకి ఈ మూడింటికి ఎంతెంత విలువ ఇవ్వాలి అనేది సంక్లిష్టంగా చూపించారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన సినిమా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా 2018లో తెర పైకి వచ్చింది. అల్లుఅర్జున్ మొదటి సారిగా సైనికుడి పాత్ర పోషించిన చిత్రం ఇది. కాస్త దురుసు తనం, దూకుడు తనంతో ఉంటాడు. సినిమాలో మిలిటరీ అంశం కన్నా తండ్రీ, కొడుకుల బంధంకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మధ్యలో ఖడ్గం, చెలియా లాంటి చాలానే సినిమాలు వచ్చాయి.
విజ‌య‌శాంతి ప్ర‌ధాన పాత్ర‌గా వ‌చ్చిన వైజ‌యంతి(2000) లో కూడా అర్మీలో త‌న క‌ర్త‌వ్యాన్ని చూపించిన‌ప్ప‌టికీ, ఎక్కువ భాగం కుటుంబపరమైన సెంటిమెంట్ ను చూపించారు. చిరంజీవి న‌టించిన స్టాలిన్ లో చిన్న భాగాన్ని చూపించి, మిగిలిన భాగమంతా కూడా దేశ అంత‌ర్గాత రాజ‌కీయాల‌పై చూపించారు., అలాగే రాజ‌శేఖ‌ర్ నటించిన ఎవ‌డైతే నాకేంటి అనే సినిమాలో అయితే పేరుకు మాత్ర‌మే అర్మీని ఉప‌యోగించారు.

ఎంత పెద్ద సరిహద్దు ను చూపించినా, వెనుక కుటుంబం తప్పని సరి.
ప్ర‌తి సినిమాలో త‌ల్లిదండ్రుల సెంటిమెంట్ నో లేక హీరోహిరోయిన్ల మధ్య ప్రేమను చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అర్మీ ప్ర‌ధానంగా వ‌చ్చిన సినిమాల‌న్నింటిలో కూడా పూర్తి సైనికుని క‌ర్వ‌వ్య నిర్వ‌హ‌ణని చూప‌కుండా, అనుబంధాల జోడింపు లేకుండా సినిమాలు రాలేదు ఇప్పటివరకు.

ప్రేమ లేని మనిషి, దేశభక్తి లేని సైనికులు ఉండరేమో కదా..! అందుకే, కాబోలు తెలుగు చిత్రసీమలో వస్తున్న సినిమాలు ప్రేమతో కూడిన సైనికులను తయారుచేస్తున్నాయి.

అసలు ఆర్మీ చిత్రాలను చూడటానికి మరొక కారణం కూడా వుంది. సైన్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత. అందుకు ప్రేక్షకులకు దొరికిన ఒకే ఒక్క వాహిక సినిమా. అందులోనే వారు చూసుకుంటారు. ఆ కొద్ధి సేపూ ఎవరికి వారు దేశానికి సైనికుల్లాగా, ఇంటిల్లిపాదికీ ఇష్టుల్లాగా కనిపిస్తారు.

-సుమాంజలి, విద్యార్థిని.

ఇంటర్న్ షిప్ వింగ్, ఎ.పి. కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *