ఆ ముసుగుల వెనుక నవ్వులేవీ..?
ఆరోగ్యకవచాలతో వైమానిక సిబ్బంది ఇబ్బందులు
“
“చిరునవ్వు చిందిస్తూ.. చేతులు జోడించి నమస్కారం పెడుతూ.. విమానం లోనికి స్వాగతం పలికే ‘ఎయిర్ హోస్టెస్’ లను చూసి ప్రయాణి కులు ఎంతో ఆనందంగా ప్రతిస్పందిస్తారు. ఇప్పుడు.. ముసుగులో ఆహ్వానం పలుకుతుంటే, ఏదో తెలియని లోటు కనిపిస్తుందన్నారు క్యాబిన్-క్రూ ఛీఫ్ జెతిన్ మెహతా.”
తల ఊపుతూ.. చిరునవ్వు చిందిస్తూ.. కంటి రెప్పలు వాల్చుతూ.. ముఖ కవళికలతో చేసే ఆ సైగలు, ఎంతటి ముక్కోపినైనా శాంతింప చేస్తాయి.
విమానంలో ఉద్యోగం అంటే కేవలం అందం ఒక్కటీ వుంటే సరిపోదు. దీనికి తోడు ఓపిక, సహనం, దైర్యం, ఎంతో అవసరం.
ప్రతీ రోజు కొత్త వారితో కలిసి ప్రయాణం చేస్తుంటారు. ఇందులో ధనికులు వుంటారు, సామాన్య ప్రజలు వుంటారు. అందరికీ సేవలందించడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరిచే తీరులన్నీ శిక్షణ లో భాగంగా ఉంటాయి.
వారు ధరించే యునిఫార్మ్ ఎయిర్ హోస్టెస్ కు గుర్తింపునూ, సమాజంలో గౌరవాన్నీ తెచ్చిపెడుతుంది. ఎయిర్ హోస్ట్ లయితే, నెత్తిన క్యాప్, షోల్డర్ పై ఫ్లాప్ప్ , హోస్టెస్ లయితే హెయిర్ స్టైల్, శారీ లను చూసుకుని ఎంతగానో మురిసిపోతారు. కానీ, పి.పి.ఇ అనే ముసుగులు వచ్చాక ఈ అలంకరణలు కనిపించకుండా కప్పివేస్తాయి.ఈ దుస్తులు వెసుకుని నాన్ స్టాప్ గా పది గంటల లండన్ ప్రయాణంలో ఉక్కపొతకు ఇబ్బంది పడిన సందర్భాలు వున్నాయి. విమానంలో క్యాటరింగ్ సర్వీసులు నిలిపివేశారు. ప్రయాణికులకు కావలసిన ఫుడ్, వాటర్ బాటిల్స్ ముందుగానే సీట్ కవర్ లో పెట్టి ఉంచుతున్నారు.
లాక్ డౌన్ తర్వాత లోకమంతా పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగతశుభ్రత పట్ల ప్రజల్లో కనిపిస్తున్న మార్పు, ఆహారంలో తీసకోవలసిన జాగ్రత్తలు, ఆరోగ్యం పై శ్రధ్ధా, భక్తీ , భయం ఇలా అన్ని విషయాల్లో మనిషి మారడం అనందించదగ్గ విషయమే.
కరోనా లక్షణాలతో వచ్చే ప్రయాణికులను చూస్తే కొంచెం భయం అనిపించినా వారికి, శిక్షణ లో నేర్చుకున్న విషయాలముందు అది చిన్న గానే కనిపిస్తుంది. త్వరగా వ్యాక్సిన్ వచ్చి తిరిగి పాతరోజులు రావాలని వారు కోరుకుంటున్నారు.
గోవింద్ రాజేష్ కుమార్, విద్యార్థి, ఎ.పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం