FeaturedFilmsNewsips

గగనతలంలో వీర వనిత

కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా 2020 ఆగస్టు 12 న ఓటీటీలో విడుదల

భారత సినీ ప్రేక్షకులు రెండు రకాల సినిమాలనూ ఎక్కువగా ఆదరిస్తారు. ఒకటి స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర అయితే, మరొకటి ప్రస్తుతం సమాజంలో జరిగే సంఘటనలు. ప్రస్తుతం అలాంటి ఒక యోధురాలు, 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి వీరనారి, భారత వాయుసేనలో తొలిసారిగా అడుగుపెట్టిన వనిత గుంజన్ సక్సేనా. తన జీవితాన్నీ ఆధారంగా తీసుకొని సినిమా రూపంలో 12 ఆగస్టు 2020 నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది “గుంజన్ సక్సేనా -ది కార్గిల్ గర్ల్”. ఈ సినిమాకి శరాన్ శర్మ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో జాహ్నవి కపూర్ కనిపించనున్నారు.

సాధారణంగా స్వాతంత్ర సమరయోధులు, దేశ భద్రతను కాపాడే సైనికులు అనగానే వెంటనే గుర్తొచ్చేది పురుషలు. ఈ మకుటాలు కేవలం వారికే అంకితం చేశామన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఒక వనిత దేశాన్ని కాపాడగలదు, యుద్ధం చేయగలదు అన్న ఆలోచన చేయడానికి కూడా సాహసించని సమాజంలో బతుకుతున్నాం. కానీ అలాంటి సమాజం నుంచే ఎంతో మంది వీర వనితలు పుట్టుకొచ్చారు. అయినప్పటికీ, ఆ చిన్న చూపు ఇంకా ఒక మచ్చలాగా  మిగిలిపోయింది. ఇది వారి అజ్ఞానానికి నిదర్శనం.

ఇక సినిమా విషయానికీ వస్తే, గుంజన్ సక్సేనా 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఏకైక సాహస వనిత. శౌర్య చక్ర అవార్డుని అందుకున్నా వీర నారి. సైనిక కుటుంబంలో జన్మించిన ఆమెకు దేశం పట్ల గౌరవం, సేవ భావం కలిగి ఉండొచ్చు. ఆమె తండ్రి అనూప్ సక్సేనా లెఫ్టినెంట్ కల్నల్ గా భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. సోదరుడు అన్షుమాన్ సక్సెనా కూడా తండ్రి బాటలోనే భారత సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. భర్త భారత వాయుసేనలో పైలట్ గా పని చేస్తున్నారు. వీళ్ళందరి సహకారానికి, ఆమె ధైర్యం తోడై రెక్కలు విచ్చుకున్న పక్షిలాగా ఆకాశంలోకి ఎగిరింది.

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ఉన్నారు. మగవాళ్లకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించినా, తిరిగి అదే సమాజం వారిని వెనకడుగు వేసేలా చేస్తుంది. ‘‘సృష్ఠి కర్త ఒక బ్రహ్మ. అతనిని సృష్టించినది ఒక అమ్మ’’ అని ఒక రచయిత అన్నారు. సమాజంలో ఏంత మందికి అర్థం అయ్యిందో..? ఈ వాక్యం. అర్థం అయినప్పటికీ అందులో అర్థమే లేదనుకుంటున్నారో.!? గానీ ఇప్పటికీ, పరిస్థితులు మేరుగుపడలేదు కదా… మార్పుకే చోటు ఇవ్వడం లేదు. కనీసం ఇలాంటి సినిమాలు రావడం వాళ్ళ సమాజ ఆలోచనలో చలనం వస్తుందా..? కనీసం ఈ సినిమా వారికి అర్థం అయ్యేలా చూపిస్తుందేమో..? చూడాలి మరీ.

-సుమాంజలి.కె, విద్యార్థిని,

ఇంటర్న్ షిప్ వింగ్, ఎ.పి.కాలేజీ అప్ జర్నలిజం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *