మందులేని వ్యాధికి… ఆత్మహత్యే పరిష్కారమా.!?
కరోనా భయంతో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా భయపడిపోతున్నారు. అసలే వర్షకాలం… అపై సీజనల్ వ్యాధులు! మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ జ్వరాలు సోకినా వణకిపోతున్నారు. కొవిడ్-19 చికిత్స పొందుతూ కొందరూ, ఈ వైరస్ సోకిందనే అనుమానంతో మరికొందరూ, టీవీ లో వచ్చిన వార్త కథనాలను చూసి ఇంకొందరూ…ఇలా ఎవరికి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ఆందోళనలు కాస్తా, ఆత్మహత్యలుగా పరిణామం చెందాయి.
తాజాగా ఓ గృహిణికి మలేరియా జ్వరం వచ్చింది. దాంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెంది, ఇంటి నుంచి పారిపోయి, బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా వుంటే, మరొచోట వైరస్ సోకి, పూర్తిగా కోలుకున్న వ్యక్తికి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని సమాచారం వైద్యులు ఇచ్చా రు. అయితే తాను ఇంటికి వెళ్ళిన తర్వాత స్థానికులు ఎలా చుస్తారోనన్న భయంతో, పీపీఈ కిట్టు తో ఫ్యాన్ కి ఉరివేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతుంది. ఇప్పటికే మనలో ఈ భయం మొదలయి అయిదు నెలలు గడిచిపోయాయి. ఏం చెయ్యాలన్నా, జాగ్రత్తగా చెయ్యాలి. అటు ప్రభుత్వాలూ, స్వఛ్ఛంద సంస్థలూ, వైద్యబృందాలూ ప్ర జలలో అవగాహన కల్పిస్తున్నాయి. కొన్ని చర్యలు పాటిస్తే, పూర్తిగా నయం చేయలేం కానీ, తీవ్రతను తగ్గించవచ్చన్న సలహాలూ, సూచనలూ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే వున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం తొలగిపోలేదు.
ఈ వైరస్ సోకిన వారిపై రోగ లక్షణాల తీవ్రత పెద్దగా కనిపించదని పరిశోధనల్లో తేలింది. దాదాపు 80 శాతం మంది జలుబూ, దగ్గూ, జ్వ రం వల్ల బాధపడుతున్నవారు యాంటిబయాటిక్స్ వాడటం వల్ల తిరిగి కోలుకుంటున్నారు. 17 నుంచి 18 శాతం మంది తీవ్రంగా అస్వస్థతకు గురయి. మంచి చికిత్స ద్వారా ఆరోగ్యవంతులవుతున్నారు. రెండు లేదా మూడు శాతం మంది మాత్రమే కోలుకోలేకపోతున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం వైరస్ సోకిన ప్రతి 20 మందిలో 19 మంది ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మందికి సరైన వైద్యం అందడంతో కోలుకుంటారని, కానీ అతి కొద్ది మాత్రమే ఆక్సిజన్, వెంటిలేటర్ వంటివి అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందనీ వైద్యులు అంటున్నారు.
ఇటీవలే జరిగిన ఒక సర్వేలో కరోనా వైరస్ పై ఉన్న అపోహల కారణంగా 28% ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై వైద్యులు స్పందిస్తూ, అపోహల్నితొలిగించి, తగు జాగ్రత్తలను పాటించాలన్నారు. నిత్య జీవితంలో వ్యాయామం చేయడం,ఆరోగ్యకరమయిన ఆహారం తీసుకోవడం, ముఖానికి మాస్క్ ధరించడం, మనిషికీ మనిషికీ మధ్య కనీసం ఒకటి నుంచి రెండు మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
-సాయి శరణ్య, విద్యార్థిని,
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అప్ జర్నలిజం.