FilmsNewsips

ప్రశాంత్ తో ప్రభాస్ కు లెక్క కుదిరింది

అమరేంద్ర బాహుబలి అను నేను, మరొసారి ఆశేషమైన అభిమానులను అబ్బురపరిచేందుకు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాననీ ప్రేక్షకులందరకి మనవి చేసుకుంటున్నాను. ఇది డైలాగ్ కాదండోయ్. నిజమే. “సలాం రాకీ బాయ్”అనే ఒక పాటని బ్రాండ్ లాగా సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ 22వ సినిమా రాబోతోంది అని సినీ వర్గాల నుంచి సమాచారం అందింది.

బాహుబలి తర్వాత ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమా ఏదీ అంటే “కె.జి.ఎఫ్” అనే అంటారు.ప్రశాంత్ ఈ సినిమానీ అయిదు భాషల్లో తెరకె క్కించాడు. 2014లో ‘ఉగ్రం’ అనే మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. సినిమాని ఎక్కువ గ్రాఫిక్స్ తో కాకుండా వాస్తవికంగా(realistic)చూపించడం ఆయన ప్రత్యేకత. పాన్ ఇండియా సినిమాలు తీయడంలోనూ పేరొందిన దర్శకుడు. ప్రభాస్ ని ‘బాహుబలి’ లో చూసిన అభిమానులు ఇకపై వచ్చే సినిమాలో కూడా ఆ స్థాయి లోనే ఉంటారని ఆశిస్తున్నారు. కానీ ‘సాహో’ నిరాశే మిగిల్చింది . హాలీవుడ్ రేంజ్ లో ఉన్నా అభిమానులను ఆకట్టుకోలేదు.ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే సినిమా బాహుబలి, కె.జి.ఎఫ్ సినిమాలను మించి ఉంటుందని సినీ అభిమానులు అనుకుంటున్నారు.

-సుమాంజలి.కె, విద్యార్థిని.
ఇంటర్న్ షిప్ వింగ్, ఏపీ కాలేజీ అఫ్ జర్నలిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *