లవర్ అంటే ‘అర్జున్ రెడ్డే’..!?
విజయ్ దేవరకొండ కేరీర్ ని మలుపు తిప్పిన సినిమా “అర్జున్ రెడ్డి”. 2017లో యువతని ఉర్రూతలూగించింది. ఈ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా, దానికున్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి సృష్టించిన “బాహుబలి-2” ఎంత అద్భుతమైన రికార్డు సృష్టించిందో, “అర్జున్ రెడ్డి” కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. సందీప్ రెడ్డీ వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. షాలిని పాండే, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా వల్ల అసలు ప్రేమంటే ఇలా ఉండాలి, ఒక అమ్మాయిని ప్రేమిస్తే అర్జున్ రెడ్డిలా ప్రేమించాలి అని యువత అనుకున్నారు.
సినిమాలో హీరో వ్యక్తిత్వం అభిమానులని ఆకట్టుకుంటే, హీరోయిన్ తన అమాయకమైన అభివ్యక్తితో ప్రేక్షకులని ఆశ్చర్యపరిచింది. ఇవ్వన్నీ పక్కన పెడితే హీరో, హీరోయిన్ల లైంగిక సన్నివేశాలు ఎక్కువ చూపించడంతో కావల్సినంత ప్రతికూలతను కూడా ఈ చిత్రం ఎదుర్కుంది. ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఈ సినిమా తన పైన ఎలాంటి దుష్ప్రభావం చూపించలేదని స్పష్టం చేశారు. సినిమాలో హీరోకి ఎంత పేరొచ్చిందో, హీరో ఫ్రెండ్ “రాహుల్ రామకృష్ణ”కి కూడా అంతే క్రేజ్ వచ్చిందని చెప్పాలి.
దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమానీ బాలీవుడ్ లో “కబీర్ సింగ్” అనే పేరుతో 2019లో పునర్నిర్మించాడు. ఇందులో షాహిద్ కపూర్, కైరా అద్వానీ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.
కె. సుమాంజలి , విద్యార్థిని, ఎ .పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం