ప్రేలుళ్ళు నిజం. ప్రాణనష్టం నిజం. ఆధారాలే లేవు!
బాంబులు నిజం. ప్రేలుళ్ళు నిజం. మనుషులు తునాతునకలవ్వటం నిజం. ప్రాణాలు కోల్పోవటం నిజం. క్షతగాత్రులవ్వటం నిజం. ఇవన్నీ కనిపిస్తూనే వుంటాయి. కానీ ఈ పని చేసిన వారెవరన్నది ప్రశ్న. దర్యాప్తు సంస్థలు కొందర్ని గుర్తిస్తాయి. ఇది ఉగ్రవాద చర్యే అని నిర్ధారిస్తాయి. ఆ కొందర్నీ విచారించి కోర్టుల ముందు పెడతాయి. తీరా అంతిమ విచారణకొచ్చేసరికి ఆ ఆధారాలు నిలవవు. అప్పుడు వాళ్ళు కేవలం అనుమానితులుగానే మిగిలిపోతారు.
‘అనుమానం ఆధారం కాదు’
‘అనుమానం ఆధారం’ కానందున కోర్టులు వారిమీద వున్న అభియోగాలను కొట్టివేస్తాయి.వారం తిరక్కుండా రెండు ప్రేలుళ్ళ మీద రెండు తీర్పులు వెలువడ్డాయి. ముంబయిలో (11 జులై 2006న) జరిగిన రైలులో బాంబు ప్రేలుళ్ళ కేసులో, 12 మందిని నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేస్తూ 24 జులై 2025న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అప్పుడు ఏకంగా 189 మంది చనిపోయారు. ఎంత మంది గాయపడ్డారో లెక్కలేదు. ఇది జరిగి వారం కాలేదు. మాలెగావ్లో (2008లో జరిగిన) ప్రేలుళ్ళ మీద ముంబయి ప్రత్యేక కోర్టు ఈ కేసులోని ఏడుగురు నిందితులనూ నిర్దోషులుగా ప్రకటించింది. మాలెగావ్ ప్రేలుళ్ళలో మొత్తం ఆరుగురు చనిపోయారు. మొత్తం 101 మంది గాయపడ్డారు. ఈ కేసు పై విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపట్టింది. ఈ రెండు చోట్లా న్యాయమూర్తులు దర్యాప్తు సంస్థల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఈ కేసులో ‘అనుమానం తీవ్రస్తాయిలో వుంది. కానీ, వారిని దోషులుగా ప్రకటించటానికి ఆ అనుమానం సరిపోదు.’ ఈ తీర్పువెలువరించిన స్పెషల్ జడ్డి అన్నారు.
‘ఉగ్ర’ కేసుల విచారణకు దశాబ్దాలా?
మాలెగావ్ (నాసిక్, మహారాష్ట్ర) ప్రేలుళ్ళ కేసే తీసుకుంటే, దర్యాప్తు సంస్థ బలహీనత స్పష్టంగా తెలిసి పోతుంది. ఈ విషయాన్ని న్యాయమూర్తే పేర్కొన్నారు. సాక్ష్యాల సేకరణలో అలసత్వం కనిపించింది. అలాగే పంచనామా జరిగినప్పుడు రికార్డు చేసిన వాంగ్మూలాలు సైతం సరిగా లేవు. సేకరించిన ఆధారాలు కూడా నిలిచేవిగా లేవు. సాక్షులు స్థిరంగా లేరు. దర్యాప్తును అలా వుంచితే, ఇలాంటి ఘోరమైన ‘ఉగ్ర’ నేరాలపై విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది?

నిజంగానే దర్యాప్తుకు సంబంధించి పలు ప్రశ్నలు ముందుకొస్తాయి. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఒక్కటే. ఇంత దారుణంగా బరితెగించి, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. వెనుక ఉగ్రవాద సంస్థలున్నాయి వుంటున్నారు. వీటి వెనుక ఉన్మాదాన్నే మతంగా చూపించే సంస్థలున్నాయంటున్నారు. ఈ రెండు పేలుళ్ళ వెనుకా రెండు మతాలను అడ్డుపెట్టుకున్నట్టుగా మొత్తం దర్యాప్తు కొనసాగింది. కానీ అంతిమంగా ఫలితం తుస్సుమంది. అయినా దర్యాప్తులో అంతటి అలసత్వాన్ని ఎలా చూపిస్తారు? ఈ అలసత్వం అలాంటి ‘ఉగ్ర’ సంస్థలు (వున్నట్లయితే) మరింత బరి తెగించవా? మరింత బీభత్సాన్ని సృష్టించటానికి ప్రయత్నించవా? మాలెగావ్ (నాసిక్, మహారాష్ట్ర) ప్రేలుళ్ళ కేసే తీసుకుంటే, దర్యాప్తు సంస్థ బలహీనత స్పష్టంగా తెలిసి పోతుంది. ఈ విషయాన్ని న్యాయమూర్తే పేర్కొన్నారు. సాక్ష్యాల సేకరణలో అలసత్వం కనిపించింది. అలాగే పంచనామా జరిగినప్పుడు రికార్డు చేసిన వాంగ్మూలాలు సైతం సరిగా లేవు. సేకరించిన ఆధారాలు కూడా నిలిచేవిగా లేవు. సాక్షులు స్థిరంగా లేరు. దర్యాప్తును అలా వుంచితే, ఇలాంటి ఘోరమైన ‘ఉగ్ర’ నేరాలపై విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? మాలెగావ్ ప్రేలుళ్ళు జరిగి 17 యేళ్ళయిపోయింది. బాధితులకు ఊరట, ఓదార్పు ఎలా వస్తుంది? ఇన్నేళ్ళ తర్వాత కూడా ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారు అన్నది దేశం తెలుసుకోలేక పోయింది.ఈ రెండు కేసులే కాదు. 2007 లో జరిగిన సంఝౌతా ఎక్స్ ప్రెస్ ప్రేలుళ్ళలో 68 మంది చనిపోయారు. అదే ఏడు మక్కా మసీదు ప్రేలుళ్ళలో తొమ్మిది మంది చనిపోయారు. అస్మీర్ దర్గా ప్రేలుళ్ళలో ముగ్గురు చనిపోయారు. ఈ మూడు కేసుల్లో కూడా నిందితులకు శిక్ష పడేటట్లు చూడటంలో దర్యాప్తు సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయి.

ఈ కేసుల్లో కొన్ని రాజకీయాలను ప్రభావం చేసేవిగా కూడా వున్నాయి. మాలెగావ్ కేసునే తీసుకుంటే, ఇందులో ప్రధాన నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. ఆమె కాషాయాంబర ధారి. దాంతో దీనిని తొలుత ‘కాషాయోగ్రవాదం’ గా కూడా భావించారు. తొలుత దర్యాప్తులో బాంబులు అమర్చిన మోటారు వాహనం ఆమెదే అని చెప్పారు. ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత 2017లో బయిలు మీద విడుదలయ్యారు. అప్పటి నుంచీ వెలుపలే వున్నారు.
‘నో అప్పీల్’
ఈ కేసుల్లో కొన్ని రాజకీయాలను ప్రభావం చేసేవిగా కూడా వున్నాయి. మాలెగావ్ కేసునే తీసుకుంటే, ఇందులో ప్రధాన నిందితురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. ఆమె కాషాయాంబర ధారి. దాంతో దీనిని తొలుత ‘కాషాయోగ్రవాదం’ గా కూడా భావించారు. తొలుత దర్యాప్తులో బాంబులు అమర్చిన మోటారు వాహనం ఆమెదే అని చెప్పారు. ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత 2017లో బయిలు మీద విడుదలయ్యారు. అప్పటి నుంచీ వెలుపలే వున్నారు. అది వేరే విషయం. ఆమె బీజేపీ టికెట్ మీద 2019లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అలాగే మరో ముద్దాయి సైనికాధికారి. లెఫ్టినెంట్ కల్నల్ శ్రీ కాంత్ పురోహిత్. ప్రేలుళ్ళు జరిగే నాటికి ఈయన మిలటరీ నిఘా విభాగంలో పనిచేస్తున్నారు. ఈ ప్రేలుళ్ళకు ఈయనను ప్రధాన కుట్రదారుడిగా దర్యాప్తు సంస్థ పేర్కొన్నది. ఆయన 2006లో ‘అభినవ్ భారత్’ అనే సంస్థను స్థాపించాడని అబియోగం. ఆయన కూడా 2017 వరరకూ నిర్బంధంలోనే వున్నారు. ఈ కేసుల్లో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన తీర్పుల పై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్. ఐ. ఎ) పై అప్పీలు కు కూడా వెళ్ళటం లేదు.
నీరుగార్చిన దర్యాప్తుకు శిక్షలుండవా?
దర్యాప్తులో అలసత్వం ప్రకటించారని కోర్టులు అనటంతోనే సరా? ఆ దర్యాప్తు సంస్థల్లో ఏ అధికారినీ బాధ్యుల్ని చెయ్యలేరా? అందుకు వారి మీద ఎలాంటి చర్యలూ వుండవా? టెర్రరిజం అణచివేతకు పార్లమెంటు కఠినమైన చట్టాలనే చేస్తోంది. ఇలాంటి దాడులు జరిగిన ప్రతీ సారీ – జరిగింది ఒక చోటే అయినా- దేశం మొత్తం వణకి పోతుంది. ఇలాంటి కేసుల దర్యాప్తు విషయంలో దర్యాప్తు సంస్థల స్వతంత్ర వైఖరిమీద దేశానికి అనుమానం రావటం అంత మంచిది కాదు.
సతీష్ చందర్
1 ఆగస్టు 2025