‘విజయ్ మామ’ జెన్ జెడ్ కేబినెట్?
సోషల్ జస్టీసా? సోషల్ మీడియా జస్టీసా?
రుణం. అవును రుణమే. తీర్చేసుకుంటానన్నాడు దళపతి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చెప్పిన తొలి మాట. ఎవరి రుణం? ముందు ప్రభుత్వాలు చేసిన లక్షల కోట్ల రుణాలు కాదు సుమీ!
పిల్లల రుణం. కుర్రకారు రుణం. జెన్-జెడ్ రుణం. ‘ఆబాల గోపాలం’ గెలపిస్తేనే కదా తాను గెలిచిందీ? సరే ఎప్పుడు ఎలా తీర్చుకుంటాడో తర్వాత చూడవచ్చు.
ఇప్పుడు మాత్రం తొమ్మిది మంది తో మంత్రి మండలి ఏర్పాటు చేశాడు. ‘సోషల జస్టీస్ కూ, సెక్యులరిజా’నికీ ‘టైమ్ స్టార్ట్స్’ (సమయం మొదలయ్యింది.) అని సంకేతంగా చేతీ వాచీ కూడా చూసుకున్నాడు.
అయితే మంత్రి మండలి సభ్యులను చూశాక రెండు ముక్కలు అర్థమయ్యాయి.
ఒకటి: జెన్- జెడ్ కు భరోసా
రెండు: సోషల్ మీడియా ప్రచారకర్తలకు పెద్ద పీట

మొత్తం మంత్రి వర్గంలో వున్న ఒకే ఒక్క మహిళ ఎస్. కీర్తన. వయసు 30 యేళ్ళే. ఇతర మంత్రుల్లో ఆరుగురు వరకూ 40 వ పడి లో వున్న వారే. ఇద్దరే సీనియర్ సిటిజన్లు.
మొత్తం మంత్రి వర్గంలో వున్న ఒకే ఒక్క మహిళ ఎస్. కీర్తన. వయసు 30 యేళ్ళే. ఇతర మంత్రుల్లో ఆరుగురు వరకూ 40 వ పడి లో వున్న వారే. ఇద్దరే సీనియర్ సిటిజన్లు.
తనకూ తన పార్గీ (టీవీకే) కూ ఎవరు ఎక్కువ ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా కల్పించారో వారికి జోసఫ్ విజయ్ తక్షణ స్థానం కల్పించారు. నలుగురు మంత్రులు అయితే ఏకంగా ‘మీడియా, ప్రచార’ విభాగాలు చూసిన వారే. జెన్ జడ్ కూ మహిళలకూ టీవీకే పట్ట గురి కుదర్చటానికి ‘సోషల్ మీడిాయా’ ద్వారాా ప్రయత్నించిన వారే.
ఎ. రాజమోహన్: యూట్యూబర్, మీడియా పర్సనాలిటీ . ఈయన పార్టీ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు.
సి.టి.ఆర్ నిర్మల్ కుమార్: ఒకప్పుడు బీజేపీలో ఐటీ వింగ్ హెడ్ గా వున్నారు. తర్వాత టీవీకేలో చేరారు.
డాక్టర్. కె. జె. అనురాజ్. ఐఆర్ఎస్ ఆఫీసర్ గా చేశారు. టీవీకే లో ప్రచార విభాగంలో కీలకంగా వున్నారు.
ఇక అధవ్ అర్జున: ఈయన అయితే మొత్తం ఎన్నికల ప్రచార నిర్వహణనే భుజాన వేసుకున్నారు.
త్వరలో దళపతి ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలు ‘సామాజిక న్యాయాని’కి దోహదం చేసేవి వుండవచ్చు. కానీ మంత్రి వర్గంలో మాత్ర ‘సామాజిక మాధ్యమ న్యాయం’ జరిగిపోియంది.
-సతీష్ చందర్
10 మే 2026
