‘మెడిసిన్’ ఎంట్రెన్స్ కు ‘లీకు’ జబ్బు వదలదా?
నీట్ పరీక్ష అంటేనే రద్దులు!
మెడలో స్టెతస్కోపు వేసినట్టే వేసి తీసేశారు. తెల్ల కోటు కలను తెల్ల కాగితాల మీదనే మిగిల్చేశారు. విద్యార్థుల పట్టుదలనంతా పరీక్ష హాలు దగ్గరే సడలించేశారు. మే 3 న జరిగిన నీట్ (National Eigibility cum Entrance Test) యూజీ 2026 పరీక్ష ను నిలువునా రద్దు చేశారు. ఒకరా, ఇద్దరా? ఏకంగా దేశవ్యాపితంగా 22 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. వీళ్ళందరి ఎం.బి.బి.యస్ కలలూ ఏమయినట్లూ?
కారణం ‘లీకు’. అదే మేకయ్యింది. పరీక్షకు 15 రోజులకు ముందే, ‘గెస్ పేపర్’ పేరు మీద ప్రశ్నాపత్రం ‘వాట్సాప్’ లో చక్కర్లు కొట్టింది. తీరా అసలు పరీక్ష రానేవచ్చింది. ఆశ్చర్యం! అందులో 120 ప్రశ్నలు ‘గెస్ పేపర్’ లో వున్నవే. మొత్తం ప్రశ్నలే 200. అందులో విద్యార్థులు రాయాల్సినవి 180. అంటే మూడింటా రెండో వంతు ప్రశ్నలు ముందే తెలిసిపోయినట్లు.
ఈ పరీక్షను నిర్వహించేది ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ). రద్దు చెయ్యటం తప్పటం లేదని విస్పష్టంగా చెప్పేసింది. పోలింగ్ లో అవతవకలు జరిగితే ఎన్నికల కమిషన్ ఎంత సునాయాసంగా ‘రీపోలింగ్’ అంటుందో, అంతే సౌకర్యవంతంగా ‘రీకండక్టింగ్’ అనేసింది. ఈ పరీక్షను ‘ఇంకో సారి రాయండి,’ ‘ఇంకో సారి నరాలు తెంచుకోండి.’ అని చెప్పటమే. ఈ దెబ్బకు మానసికంగా నలిగి ‘కాబోయే డాక్టర్ల’లో ఎంత మంది ‘పేషెంట్లు’ అవుతారో తెలియదు.
ఈ ‘లీకు’ వ్యాధి ‘మెడిసిన్ ’ కు కొత్త కాదు. ఈ ఆరోపణలు 2018 నుంచి ప్రతీ మూడేళ్ళ కోసారి వస్తూనే వున్నాయి.
2018లో కొన్ని కోచింగ్ సెంటర్లే ‘సాల్వర్ గ్యాంగ్స్’ ను పెట్టుకున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. కానీ, అప్పుడు మాత్రం పరీక్ష రద్దు కాలేదు.

అప్పటి లీకు ‘ఉచితం’ కాదు. బీహార్, జార్ఖండులలో ఇంకు భారీ నెట్ వర్కే వున్నట్లు అభియోగాలు వచ్చాయి. ఈ పేపర్లను ముందుగా పొందటానికి అభ్యర్థులు భారీ మొత్తాన్నే చెల్లించారని ఆరోపణలూ తయారయ్యాయి. హజారీబాగ్ లోని ఒక స్కూలు కేంద్రంగా ఈ లీకు జరిందని దర్యాప్తు సంస్థ తేల్చింది. పరీక్షా పత్రాల ప్యాకెట్లను ముందుగా తెరిచేసి, ఎంచక్కా మొబైల్ ఫోన్ కెమరాలతో ‘క్లిక్’ మనిపించేసి, తర్వాత పైకం చెల్లించిన వారికి వాటిని అనుమానితులు పంపారని దర్యాప్తులో తేలింది.
2021 లో జరిగిందీ అందరికీ తెలిసిందే. ఇంకా అర్థగంటలో నీట్ పరీక్ష మొదలవుతుందనగా సోషల్ మీడియా పరీక్షా పత్రం మొత్తం రౌండ్లు తిరగింది. ఇక నీట్ యూజీ 2024 నాటి లీకు విషయం లో అల్లరి ఆకాశాన్నంటింది. సీబీఐ దర్యాప్తు దాటి, సుప్రీం కోర్టు గుమ్మం కూడా తొక్కేసింది. అయితే అప్పటి లీకు ‘ఉచితం’ కాదు. బీహార్, జార్ఖండులలో ఇంకు భారీ నెట్ వర్కే వున్నట్లు అభియోగాలు వచ్చాయి. ఈ పేపర్లను ముందుగా పొందటానికి అభ్యర్థులు భారీ మొత్తాన్నే చెల్లించారని ఆరోపణలూ తయారయ్యాయి. హజారీబాగ్ లోని ఒక స్కూలు కేంద్రంగా ఈ లీకు జరిందని దర్యాప్తు సంస్థ తేల్చింది. పరీక్షా పత్రాల ప్యాకెట్లను ముందుగా తెరిచేసి, ఎంచక్కా మొబైల్ ఫోన్ కెమరాలతో ‘క్లిక్’ మనిపించేసి, తర్వాత పైకం చెల్లించిన వారికి వాటిని అనుమానితులు పంపారని దర్యాప్తులో తేలింది. ఇదంతా దేశవ్యాపితంగా ప్రభావితం చూపిందనటానికి ఆధారాలు సరిపోలేదు కాబట్టి పరీక్ష ను రద్దు చెయ్యటానికి సర్వోన్నత న్యాయస్థానం ఒప్పుకోలేదు.
అయితే ‘నీట్’ కు ముందు ఈ తరహా పరీక్షనే ‘ఏఐపీఎమ్టీ’ (All India Pre-Medical/ Pre-Dental Entrance Test) నిర్వహించే వారు. అప్పుడు ఈ పరీక్షను ‘సీబీఎస్ఈ’ నిర్వహించేది. అప్పుడు కూడా ‘లీకు’ ఘటనలు వున్నాయి:
అన్నిటికన్నా 2015 లో జరిగింది సంచలనాత్మకమైనది. అప్పుడప్పుడే వస్తున్న ‘బ్లూటూత్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా నిందితులు ఉపయోగించుకున్నారు. చొక్కా గుండీల స్థానంలో కెమెరాలను పరీక్ష కొచ్చే(700 మంది) అభ్యర్థులకు అమర్చారు. వీరు ప్రశ్నలకు సమాధానాలు కూడా సిమ్ అమర్చిన వెస్ట్స్ ద్వారా ఒక కంట్రోల్ రూమ్ లోనుంచి వచ్చాయి. వీళ్ళంతా 10 రాష్ట్రాలకు చెందిన వారు. అప్పుడు కూడా సుప్రీం కోర్టు మొత్తం పరీక్షను రద్దు చేసింది.
ఇక 2014 సంగతి సరేసరి. బరేలీలో లోని ఒక బాంకు వద్ద ప్రశ్నాపత్రాల బాక్సులు పడి వున్నాయి. చిత్రం కదూ! ఏం చెయ్యాలి. పరీక్ష రద్దు చెయ్యాలి. చేశారు కూడా.
ఎంబిబియస్ చదవటానికి దేశవ్యాపితంగా ఒక పరీక్ష నిర్వహించుకోవటం మొదలయినదే 2013 నుంచి. ఆ తర్వాత ఏడాది నుంచే ఈ ‘మెడికల్ కామన్ ఎంట్రన్స్’ కు ‘లీకు వ్యాధి’ సోకింది. అప్పటి నుంచీ వదల్లేదు. ఈ పరీక్ష వరకూ వచ్చారూ అభ్యర్థులకు 17 యేళ్ళ వరకూ నిండుతాయి. ఇంకో ఏడాది దాటితే వోటు హక్కు కూడా వస్తుంది. వీరూ ‘జెన్ జెడ్’ జనరేషన్ లో కీలకమే. ఈ ‘జెన్-జెడ్ ’ వోటర్లే కేంద్రంలోనూ, రాష్ట్రంలో పార్టీలను అధికారంలోకి తేవటానికి కీలకమవుతున్నాయి. అయిన ఈ ‘లీకు’ వ్యాధి ప్రభావానికి ‘జెన్ జెడ్ వోటర్లు’ గురవుతున్నట్లు ఈ సర్వేలోనూ రాలేదు. ‘పరీక్ష’లే నిర్వహించలేని వారు, ‘ప్రభుత్వాల’ను ఎలా నిర్వహించగలుగుతారు? ఈ చిన్న లాజిక్కును ‘జెన్- జెడ్’ వోటర్లు ఎలా మిస్సవుతున్నారు?
సతీష్ చందర్
12 మే 2026
