FeaturedPoliticsTwittorials

‘పొత్తు’ పోస్టరెక్కాక గానీ, సతీశన్ సీఎం కాలేదు!

మూడు ముక్కలాటే. అనుమానం లేదు. కేరళ ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్ అడింది అదే. కానీ ‘చేతి’వాటం చూపించటానికి వీలు కాలేదు. పార్టీ ‘హై’ కమాండ్ కాస్తా, ఈ ఎంపికలో ‘లో’ కమాండ్ కావలసి వచ్చింది. రాహుల్ గాంధీకి అత్యంత విధేయుడయిన కేసీ వేణుగోపాల్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. రమేష్ చెన్నితల చేసిన చివరి ప్రయత్నాలు కూడా వీగి పోయాయి. కడకు వీడీ సతీశన్ ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ (కేరళ) ముఖ్య పీఠం పీద కూర్చుంటున్నారు.

ఈ ఎంపికలో ఎత్తులూ, పైయెత్తులూ చిత్తయి పోయాయి. కడకు ‘పొత్తులే’ పనిచేశాయి. కాంగ్రెస్ అంటే యూడీఎఫ్ (United Democratic Front), యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ అని పైకి అనిపించవచ్చు. కానీ కాదు. యూడీఎఫ్ గెలుచుకున్న 102 సీట్లలో 63 మాత్రమే కాంగ్రెస్ వి. మిగిలిన 29 సీట్లలో 22 ఐయుఎంఎల్(Indian Union of Muslim League) కు22, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్ వర్గం) కు 8. ఆర్.ఎస్.పి కు 3 వచ్చాయి.

రాహుల్ అడుగులకు మడుగులొత్తే కేసీ వేణుగోపాల్ ను ముఖ్యమంత్రి గా చేస్తే పర్యావసనాలు తీవ్రంగా వుంటాయని ఆ పోస్టర్ల సారాంశం. అదే జరిగితే ‘వాయనాడ్ అమేధీ’ అవుతుందని (రాహుల్ గాంధీని అమేధీలో ఒకప్పుడు ఓడించినట్లు, వాయనాడ్ లో ఓడించాల్సి వస్తుంద’)ని ఒక పోస్టర్ సారాంశం.

దాంతో కాంగ్రెస్ పూర్తగా ‘పెద్దన్నయ్య’ పెత్తనం చెయ్యటానికి వీలు లేక పోయింది. అందుకు అడ్డుకున్నది ప్రధానంగా ఐయూఎంఎల్. కేరళలోని మలబారు ప్రాంతంలో ఈ పార్టికి గట్టి పట్టువుంది. ఈ పార్టీతో పొత్తు వల్లే, కాంగ్రెస్ పోటీ చేసిన ప్రతీ నియోజక వర్గంలోను ముస్లిం వోట్లు అనుకూలించాయి. ఈ పార్టీ ఆదినుంచీ వీడీ సతీశన్ నే ముఖ్యమంత్రి అభ్యర్దిగా చెయ్యాలని పట్టుపడుతూ వచ్చింది. ఈ వత్తిడి ఆ పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్తల స్థాయి వరకూ దిగిపోయింది. దాంతో నేరుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చేరేలా, (ప్రియాంక ప్రాతినిథ్యం వహిస్తున్న) వాయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పోస్టర్లు వెలిశాయి. రాహుల్ అడుగులకు మడుగులొత్తే కేసీ వేణుగోపాల్ ను ముఖ్యమంత్రి గా చేస్తే పర్యావసనాలు తీవ్రంగా వుంటాయని ఆ పోస్టర్ల సారాంశం. అదే జరిగితే ‘వాయనాడ్ అమేధీ’ అవుతుందని (రాహుల్ గాంధీని అమేధీలో ఒకప్పుడు ఓడించినట్లు, వాయనాడ్ లో ఓడించాల్సి వస్తుంద’)ని ఒక పోస్టర్ సారాంశం అయితే, ‘ఇదే తప్పిదం జరిగితే రాహుల్ నీ, ప్రియాంక’ను కేరళ ప్రజలు క్షమించరని మరొక పోస్టర్ సారాంశం.

ఐయూఎం ఎల్ పార్టీయే వాయనాడ్ నుంచి 2019, 2024లో వరసగా రాహుల్ నీ, ఆయన స్థానంలో ప్రియాకను గెలిపించటానికి కీలక పాత్ర పోషించింది.

ఇక సతీశన్ ఎంచుకోవటానికి ఆయనకున్న  మూడు పార్శ్వాలు (3Dimensions) దోహదం చేశాయి.

ఒకటి: ఎల్డీఎఫ్ అధికారంలో వున్నప్పుడు ఆయనే కేరళ శాసన సభలో ప్రతి పక్ష నేతగా వున్నారు.

రెండు: ఎన్నికల రాజకీయాల్లో తలపండిన వాడు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన వరసగా ఆరో సారి ఎన్నికయ్యారు. గాలులతో సంబంధం లేకుండా, ఆయనను ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనకు పట్టం కడుతూ వచ్చారు.

మూడు: అక్షరాస్యతలో అగ్రరాష్ట్రంగా వుండే కేరళను పాలించే విద్యార్హతలు ఆయనకు సమృధ్ధిగా వున్నాయి. అందుకే కేవల ఐయూఎం ఎల్ కే కాకుండా మిగిలిన భాగస్వామ్య పక్షాలకు కూడా ఇష్టుడయ్యాడు.

మీన మేషాలు లెక్కించినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పాటు రాహుల్, ప్రియాంకలు కూడా తమ విధేయుడిని పక్కన పెట్టి సతీశన్ ను అంతిమంగా ఎంచుకోవాల్సి వచ్చింది. ఎంపిక చెయ్యగానే సరిపోదు. ముందున్నది ‘ముఠాల పండుగ’. దానిని సమర్థవంతంగా కాంగ్రెస్ నాయకత్వం సమర్థం వంతగా ఎదుర్కోవాల్సి వుంటుంది.  

14 మే 2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *