FeaturedPoliticsTwittorials

‘వోటు’ హక్కును ‘ట్వీటు’ హక్కు రక్షిస్తుందా?

హక్కు హక్కే. హక్కును హక్కే రక్షిస్తుంది. వోటు హక్కును ‘ట్వీటు’హక్కుతో రక్షించుకోవాల్సి వస్తుంది. ‘ట్వీటు’ కాక పోతే ‘ఎక్స్’. లేదంటే ‘ఇన్స్టా’.. ఏదో ఒకటి. భావప్రకటనకు చిన్న జాగా. డిజిటల్ స్సేస్. అన్ని హక్కులక భరోసా రాజ్యాంగం. అది వేరే విషయం.

చిన్న విసుగు. అది కూడా పెద్ద వ్యక్తి నుంచి. ఆ వ్యక్తి కూడా అతి పెద్ద స్థానంలో వున్న వ్యక్తి. ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ సూర్యకాంత్. చిన్నా, చితకా, చిల్లర పిటిషన్లకు విసిగి పోయి.(15మే2026న) కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ‘యువజనం’ మీద.

అలా చెయ్యటం లో ‘కొంతమంది కుర్రవాళ్ళ’ను ‘బొద్దింకలు’ గానూ, ’పరాన్నజీవులు’గానూ అభవర్ణించారు. ఇది జరిగి 24 గంటలు కాలేదు. ఏకంగా ’బొద్దింకల పార్టీ’ యే అవతరించింది. దాని పేరు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janata Party-CJP). అది పుట్టిందే డిజిటల్ ప్రపంచంలో. ఇంకా చెప్పాలంటే జెన్-జెడ్ ప్రపంచంలో. వెటకారమే. కాకుంటే వెబ్ వెటకారమే. ‘వెబ్’కారం అనుకోరాదూ? ఇష్టానుసారం (సారీ, ఇన్ స్టానుసారం)  కామెంట్స్ చేసుకోవటానికి అనువయిన వేదిక ‘ఇన్ట్సాగ్రామ్’ వుండనే వుంది. అందులో వున్న ‘సీజేపీ’ పేజీకి ఒక్క రోజులో కోటిన్నర అనుచరులు (Followers) ఏర్పడ్డారు. బీజేపీకే ఇంతవరకూ 88 లక్షల అనుచరగణం దాటలేదు.

ఇందులో విచిత్రాలు రెండు.

మొదటి విచిత్రం: అత్త మీద కోపం దుత్త మీద చూపటం. ప్రధాన న్యాయమూర్తి మీద కోపం ఒకానొక పార్టీ మీద చూపటం. ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యే కావటం.

రెండవ విచిత్రం: అసలుకు కన్నా, నకలుకు ఎక్కువ ఆదరణ పొందటం. అసలు భారతీయ జనతా పార్టీ అయితే, నకలు కాక్రోచ్ జనతా పార్టీ. తెలుగు వ్యాకరణ పరిధిలో చెప్పాలంటే, బీజేపీ ప్రకృతి, సీజేపీ వికృతి.

అంటే దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా లేదని, సీజేపీ వ్యవస్థాపకుల ఉద్దేశ్యమా? స్వతంత్రంగా లేదంటే పరతంత్రంగా వుందనా? పాలకతంత్రంగా వుందనా? బహుశా రెండవదే అయి వుండాలి. లేకుంటే. ఈ కొత్త ‘వెబ్’ పార్టీ మేనిఫెస్టో లో ఒక హామీ కూడా ఇచ్చారు. అదే సీజేపీ మొదటి హామీ కూడా. సీజేపీ అధికారంలోకి వస్తే, పదవీ విరమణ పొందిన ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వదని.

బీజేపికి ఎన్నికల్లో గెలుపు మీద గెలుపు వస్తోంది. ఇది బలుపు కాదు వాపూ అని విపక్షాలు గింజుకున్నంత మాత్రాన బలుపు బలుపు కాకుండా పోతుందా? ఈ బలుపుకు ‘జెన్-జెడ్’ (నవతరం అనే ‘వెబ్’ తరమే) అని విశ్లేషణలు నమ్మించాయి. అదే నిజమయితే, ఒక్క రోజులో ‘జోకు’ ‘మేక’వ్వదు. బీజేపీ కి పేరడీ (వ్యంగ్యానుకరణ) సీజేపీ.

జెన్-జెడ్ డిఎన్ఎ వున్న యువకుడే ఒకతను ‘బొద్దింకల’ వ్యాఖ్య మీద ఇంత పెద్ద కామెడీ చేశాడు. అతని పేరు. అభిజిత్ దిప్కే. లోక్ పాల్ ఉద్యమంలో పాల్గొన్న యువకులకు తర్వాత కాలంలో కేజ్రీవాల్, ఒక ‘క్రేజీ’ వాలే. దాంతో అభిజిత్ కూడా ఆయన పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి వచ్చేశాడు. ఇప్పుడయితే పార్టీలతో సంబంధం లేకుండా బుధ్ధిగా బోస్టన్ యూనివర్శిటీ (అమెరికా)లో పౌరసంబంధాల మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటున్నాడు.

‘జెన్-జెడ్’ కు చికాకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి చికాకు మీద చికాకు వచ్చిందని భావించకుండా ఎలా? జెన్-జెడ్ కు గతంలో ఉత్త చికాకు కాదు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న సందర్భాలు లేక పోలేదు. అవినీతి మీద ఒక సారీ (లోక్ పాల్ ఉద్యమం పేర), అత్యాచారం మీద ఒక సారీ (నిర్భయ ఉద్యమం పేర) జెన్-జెడ్ యువతరం ఢిల్లీని ముట్టడించింది.

అలాంటి జెన్-జెడ్ డిఎన్ఎ వున్న యువకుడే ఒకతను ‘బొద్దింకల’ వ్యాఖ్య మీద ఇంత పెద్ద కామెడీ చేశాడు. అతని పేరు. అభిజిత్ దిప్కే. లోక్ పాల్ ఉద్యమంలో పాల్గొన్న యువకులకు తర్వాత కాలంలో కేజ్రీవాల్, ఒక ‘క్రేజీ’ వాలే. దాంతో అభిజిత్ కూడా ఆయన పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి వచ్చేశాడు. ఇప్పుడయితే పార్టీలతో సంబంధం లేకుండా బుధ్ధిగా బోస్టన్ యూనివర్శిటీ (అమెరికా)లో పౌరసంబంధాల మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటున్నాడు.

‘వెబ్’ కారం అభిజిత్ కు కొత్త కాదు. ఆప్ సామాజిక మాధ్యమాల బృందంలో ఈయన ఇదే పని చేసేవాడు. ఇతని అసలు నివాసం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ లో వుంది.

అభిజిత్ వదిలిన బొద్దింకల ప్రభావం అంతా ఇంతా కాదు. మధురలో అయితే(22 మే 2026న) ఓ కుర్రాడు ‘బొద్దింక’ వేషం వేసుకుని మునిసిపల్ ఆఫీసు ముందు డ్యాన్సు కట్టాడు. ఎందుకూ, అని అడిగితే, మురుగు కాల్వ శుభ్రం చేసి ‘యుగాల’య్యిందన్నాడు. అదొక నిరసన రూపంగా అతడు భావించాడు.

ఎంత జనాదరణ వుందో, ప్రభుత్వం నుంచి అంత వ్యతిరేకతా వచ్చిపడింది. అతని ఆట కట్టించాలని అతడి ‘ఎక్స్’ అకౌంట్ ను మూత వేశారు. అభిజిత్ ఈ చర్యపై ఢిల్లీ హైకోర్టు వరకూ వెళ్ళవలసి వచ్చింది. అభిజిత్ ను చంపుతామన్న బెదరింపులు కూడా వచ్చాయి. అమెరికా నుంచి ఇండియా వస్తే అరెస్టు కూడా కావచ్చని అతను భావిస్తున్నాడు. ఇక ఏ పార్టీ (బీజేపీని ) అయితే వెటకారమాడాడో, ఆ పార్టీ కి చెందిన శ్రేణుల ‘ట్రోల్స్’ అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ తట్టుకోగలుగుతున్నాడు కానీ, ఒక్కటి మాత్రం భరించలేక పోతున్నట్టున్నాడు: అభిజిత్ దళిత వర్గానికి చెందిన మధ్యతరగతి కుటుంబ నేపథ్యం ఇతనిది. దాంతో అభిజిత్ మీద ‘ట్రోల్’ చేసేవాళ్ళకి ‘కులం’ కూడా ఓ ఆయుధమయి పోయింది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *