’నంది’ వెళ్ళని సినీకుటుంబం వుందా..?
టాలీవుడ్ తార లమీద రంగు పడింది. అవును. ‘పసుపు’ రంగే. అవార్డులే కావచ్చు. అయితే మాత్రం రాజకీయం కాకుండా వుంటాయా..? . తాజాగా నంది అవార్డుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల జాబితాను గమనిస్తే అందులో ప్రతి సినీ కుటుంబాలను కలుపుకోని పోయేలా రూపొందించారు. అయితే ఇది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని చేసినట్లుందనే ప్రచారం లేకపోలేదు. గతంలో వున్నట్లు ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సపోర్టు తీసుకొని పోయేలా రూపొందించి, కొంత మేర గ్రౌండ్ వర్క్ చేస్తుందనడంలో సందేహం లేదు.
అయితే 2004 ఎన్నికలను ఒక్కసారి పరిశీలించి చూసినట్లయితే సినీ ఇండస్ట్రీ మొత్తం టిడిపినే సపోర్టు చేసిన సందర్భాలు న్నాయి. రాను రాను ఇండస్ట్రీ కాస్తా, కుటుంబాలకు పరిమితమై ఎవరికి వారే ఆన్నట్లు వ్యవహరిస్తూ చివరకు 2009 ఎన్నికలలో వై.యస్ రాజశేఖర్ రెడ్డి కి సపోర్ట్ చేసెలా తన వైపు ఆకర్షించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేంటంటే సినీ రంగాన్ని తనదైన శైలిలో తెలుగు ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి రాజకీయల్లోకి ప్రవేశించి ఒకానొక సమయంలో తన ఇండస్ట్రీ సపోర్టు తగినట్టు లేదని గ్రహించాడు. చివరకు తన పార్టీని జాతీయ పార్టీలో విలినం చేశారు.(అది వేరే విషయం లెండి).
ప్రస్తత రాజకీయాలను చూసినట్లయితే, రాబోయే ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పరిణామాలు మారుతున్నాయి. అందులో బాగంగానే సినీ నంది అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం ఎలాంటి ఆభిప్రాయ భేదాలు లేకుండా ఆచితూచి వ్యవహరించనట్లు తెలుస్తుంది. ఒకప్పటి చరిత్రను తిరగరాస్తున్న చంద్రబాబు కొంత సక్సెస్ అయినప్పటికీ, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఎందుకనో మొదటినుంచీ, సినీప్రముఖుల మీద ఆసక్తి లేదు. ఉన్నవారిలో ‘హీరో-హీరోయిన్’ దంపతులను ఇటీవలే జారవిడుచుకున్నారు. ఇప్పటి వరకు వున్న సినీ నటులలో వైసీపి తరపున రోజా ఒక్కరే ఈ పార్టీలో స్థిరంగా వున్నారు. విజయానికి ‘తారలు’ అనుకూలించక్కర లేదూ- అని భావిస్తున్నారో ఏమో..!