’గిరిజనం‘ మీద జగన్ కు పట్టు తప్పుతోందా..?
ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటినన్నింటిని అధిగమించి సీఎం పీఠాన్ని ఆదిరోహించాలనే తపనతో వున్న జగన్‌కు మరోకసారి పాలకపక్షం ఇస్తున్న షాక్ ను ఎదుర్కోవటం తప్పలేదు. ఈ మధ్యే తమ పార్టీ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కిన నష్టం నుంచి తేరుకోక ముందే మరో శరాఘాతం. ఎలా తీసుకుంటారో మరి?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయలను పరిశీలించినట్లయితే … ఒకవైపు పాదయాత్ర కొనసాగిస్తున్న జగన్‌కూ, పార్టీలోని శ్రేణులకూ, ఎమ్యెల్యేలకూ మధ్య దూరం పెరుగుతుందా..? అనే అనుమానాలకు తావిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాదయాత్రను ప్రారంభించిన జగన్ తన పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకునే స్థితిలో ఉన్నారో ..? లేదో ..? అనే ఆలోచనలో పడ్డారు.పార్టీ శ్రేణులు ” అందుకేనేమో ప్రక్క పార్టీలోకి చూస్తున్నారువీరు” అంటూ వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు ప్రత్యర్థులు.
ఇప్పటికే 22 మంది వైసిపి ఎమ్మెల్యేలు పచ్చపార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఎమ్మెల్యే పచ్చ కండువా కప్పించుకోడానికి రంగం సిద్దం అయ్యిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికలలో మరోసారి గెలిచేందుకే పార్టీ మారనున్నట్లు సమాచారం. పాడేరు నియోజకవర్గాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ పరంగా కాకుండా తమ వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచిన సందర్భాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను పరిశీలించినట్లయితే బిఎస్‌పి నుండి రాజారావు లాకె గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ సారధ్యం వహించినప్పటికీ, తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ప్రస్తుత ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసిపి తరుపున గెలుపోందారు. అయితే ఈ ఎన్నికలలో కీలకంగా ప్రతి ఎలక్షన్‌లలో కూడా వోటింగ్ పర్సంటేజ్ పెరంగడంతో పాటు అభ్యర్థుల మార్పు సాధారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం వైసిపికీ ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ ప్రజల మద్దతు వున్న నేపధ్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని ప్రస్తుత ఎమ్మెల్యేలు పార్టీలు మారడాన్ని బట్టి రాను రాను జగన్ ప్రభావం తగ్గుతుందని భావించడమేనా..? ఇందుకు కారణలేమిటి..? ఈ విధంగా జరిగినట్లయితే జగన్ వ్యవహర శైలి మారుతుందా..? అనేది చూడాలి. మరీ…