ఒక రెడ్డికి ‘కారు’; ఇంకో రెడ్డికి ’చెయ్యి’..!
తెలంగాణలో ‘కారు’ స్పీడు ఎక్కడా తగ్గట్లేదు. అన్ని జిల్లా ప్రాంతాలను తిరిగొచ్చిన ‘కారు’ ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా పెద్ద ‘సైకిల్’ ని ఢీకొట్టి, కారులో ఎక్కించుకుంది. అదేనండి ! తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా టిడిపి నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి సహా తన తనయుడు,జిల్లా టిడిపి యూత్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్)లో చేరట దాదాపు ఖరారయ్యింది.
ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి, గులాబి తీర్థం పుచ్చుకున్న పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసినదే. అయితే అంతకు ముందే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేని నేతగా ఐదు సార్లు శాసన సభ్యునిగా గెలుపొందిన కోమటిరెడ్డి వేంకట్ రెడ్డిని టిఆర్ఎస్‌లోకి అహ్వానించడం, అందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిపినట్లు వార్తలు వచ్చినప్పటికీ అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. అన్ని పార్టీ నేతలనూ, కలుపుకుపోతున్న టీఆర్ ఎస్, గుత్తా సుఖేందర్ రెడ్డి ని చేర్చుకున్న కొద్ది రోజులకే అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేత టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ను లాగేసింది.
అప్పటికే గుత్తా తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళే యోచనలో ఉన్న పాలక పక్ష నేతలు తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది.
ఎప్పటి నుండో రెడ్డి సామాజిక వర్గానికి బ్రాండ్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేరిక రాష్ట్ర రాజకీయంలో మార్పు వచ్చిందనే చెప్పవచ్చేమో!
బహుశా తెరాసలోకి రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి కారణం: బలహీనంగా ఉన్న కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గ నేతలను ఒక్కతాటిపైకి తీసుకొస్తుందేమోనన్న భయం పాలకపక్షానికి కలగటమే.
అందులో భాగంగానే ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లోకి అహ్వానించారు. రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే వీరు కాంగ్రెస్ లో చేరతారనే గుసగుసలు వినిపించినప్పటికీ, కాంగ్రెస్‌లో వున్న ప్రస్తుత జిల్లా నేతలు సుముఖంగా లేని పక్షంలో తెరాసలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తన సొంత పార్టీలోనే ఉంటామనుకున్నప్పటికీ అదే జిల్లాకు చెందిన నాయకులు మోత్కుపల్లి నరసింహులు అడ్డు తగులుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్న
క్రమంలో టిడిపిని వదలి పాలక పక్షాన చేరుతున్నారు. అయితే ఈ చేరికలు ఇప్పటివి కావు. కాని అగేలా లేవు. మొత్తంగా నల్లగొండ జిల్లా రాజకీయాలను పరిశీలించినట్లయితే పాలక పక్ష పార్టీ తెరాస చేస్తున్న “ఆపరేషన్ ఆకర్ష్” కాస్త ‘ఆపరేషన్ రెడ్డి’ లీడర్స్ అనుకోవచ్చేమో…!