ఆంధ్రలో ఆగని అత్యాచారాలు!
డిల్లీలో 16-12-2012 వ తేదీ నిర్భయ పై జరిగిన లైంగికదాడిలొ దోషులకు ఉరిశిక్ష విధించారు. ఈ నిర్భయ పేరుతో చేసిన చట్టం నిర్భయ చట్టం. దీని వలన స్త్రీలపై జరిగే లైంగిక దాడులు, అత్యాచారాలు తగ్గుతాయి అనుకున్నారు. కానీ నిర్భయ కేసులు పెడుతున్నాఅవి నిలిచి, శిక్షలు పడేంతవరకూ రావటం లేదు. మనం చదివే పత్రికలలో ప్రతిరోజు ఒకటి, రెండు ప్రాంతాల నుంచి అత్యాచారాలు, లైంగిక దాడులు చూస్తునే ఉన్నాం.
ఈ నెల 17 న మధ్యప్రదేశ్ లోని విదిశా పట్టణంలో ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పై ముగ్గురు వ్యక్తులు అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తల దగ్గర తుపాకీ పెట్టి అత్యంత దారుణంగా లైంగికదాడి చేసారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఒక వృధ్ధుడు అభం, శుభం తెలియని చిన్నారి(9) పై లైంగికదాడికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని ఆకివీడు మండలం దుంపగడప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడు వెధిస్తున్నాడంటూ విధ్యార్థినులు ప్రిన్స్ పల్ కి ఫిర్యాదు చేసారు. కానీ ఆ ప్రిన్స్ పల్ కూడా అలాగే ప్రవర్తించగా వారిపై పోలీసులు నిర్భయ కేసును విధించారు… చింతపల్లిలోని ఏకలవ్య హైస్కూలు లోని ఉపాధ్యాయుడు గిరిజన విద్యార్థిని బెదిరించి, ఆమెపై లైంగికదాడి చేసాడు. ఈ నెల 7వ తేదిన విద్యార్థినికి రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆ రోజే కేసు నమొధు చేసారు. అయితే ఆ ఉపాధ్యాయుడు పరారయ్యాడు… అనంతరం అతనిన విధుల నుండి తొలగించారు. తరువాత డిఎస్పీ విచారణ చేపట్టగా కీచక గురువు లొంగిపోయాడు కానీ ఈ విషయాన్ని పోలీసులు భహిర్గతం చెయ్యలేదు.
ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూనేవున్నాయి,కేసులు పెడుతూనే ఉన్నారు. ఐదు సంత్సరాల ముందు జరిగిన నిర్భయ కేసులోని దోషులకు ఉరిశిక్ష విధించి ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతొంది కానీ వాళ్ల్లకి ఇంతవరకు శిక్ష అమలు పరచలేదు. ఇలాంటివి ఫిర్యాదు వరకే వెళ్ళేదే తక్కువ. వాటిపై దర్యాప్తు చేపట్టేది మరీ తక్కువ. సాక్ష్యాలతో కోర్టుకు వెళ్ళేది ఇంకా తక్కువ. శిక్ష పడేది మరీ తక్కవు. నిర్భయ చట్టం వచ్చాక కూడా బాధితులు కాకుండా నేరస్తులు నిర్భయులు కావటం విడ్డూరంగా వుంది.