ముందస్తు కు తొందర ఎందుకు?
తెలంగాణలో పరిష్కారించాడానికి ఎన్నో సమస్యలున్నాయి. చర్చించడానికి చాలా ఆంశాలున్నాయి. కాని రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇపుడు ఒకటే ఆంశం చర్చకు వస్తుంది. అదేనండీ… ముందస్తు ఎన్నికలు. ఈ ఆంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకు వచ్చిదనేది సగటు పౌరునికి అర్థం కాని పరిస్థితి.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ తరుణంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించడం అంటే ‘పుండు మీద కారం చల్లడమే’ అవుతుంది. ఎలాగైనా ఈసారి తమ సత్తా చాటడానికి కాంగ్రెస్ ఎదురుచూస్తుంది. అందుకు తగ్గట్లు ప్రణాళిక వేసుకున్న తక్కువలో తక్కువగా ఆరు మాసాల సమయం పడుతుంది. సరిగ్గా అదే సమయానికి ఎన్నికలు వస్తే ..? కాని టీపీసీసీ అధ్యక్ష్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఇది కేవలం మాటల వరకే ఉంటుందా… లేక ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉంటారా అనేది ముందు ముందు చూడాల్సిందే.
రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకత లేదని చేప్పలేం. అయినప్పటికీ ఈ నిర్ణయం ఎందుకు ప్రకటించారనేది అందరి మేదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కేంద్రంలో మోడిని కలిశాక ఏదైనా ముందస్తు ఎన్నికల సమాచారం లీకైందా..? లేక ఇప్పుడైతేనే గెలుస్తాడనే నమ్మకమా..? అనేది ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు వ్యతిరేకత అంతగా లేకపోయినా కొంత కాలం వేచి చూసినట్లయితే తిరిగి వ్యతిరేకత వస్తుందేమోననే భయం కూడ ఒక కారణంగా చెప్పవచ్చు.
సరిగ్గా గత కొద్ది రోజుల నుండి గమనించినట్లయితే, అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాల వరకు రైతులను పట్టించుకున్న దఖాలలు కనిపించలేదు. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పేరు మీద ఏకరానికి నాలుగు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులను దృష్టిలో వుంచుకుని సరిగ్గా పంచాయితీ ఎన్నికల ముందే గ్రామ రెవెన్యూ అధికారి (వి.ఆర్.వో) పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడం. ఇవన్నీ కూడ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తీసుకువచ్చిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. అధికార పార్టీ కూడా ఈ పరిస్థితిలోనే మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలమనే ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతుందననే అనుమానాలు లేకపోలేదు.
ఇప్పటికే అన్నింటికి సిద్ధపడి వున్న కేసీఆర్ ఈ ఎన్నికల క్యాంపేయిన్‌లో (జిహెచ్ఎంసి ఎన్నికల తరహాలో) కేటీఆర్ ను ముందుంచి నడిపించడం, తర్వాత తనకి సీఎం పదవి కట్టబేట్టి, కేసీఆర్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పే ఆలోచనలు కూడ ఉండవచ్చు. ఇది కూడ ఒక కారణమై ఉండవచ్చు.
-తెలుగూస్ పొలిటికల్ బ్యూరో