జగన్ రాజీ ’డ్రామా‘లు బాబుకు అంటవా..?
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా పై ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో కేంద్రం ప్రకటన చేసింది.ఆతర్వాత టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు. తెలిపారు. అలాగే వైకాపా కూడా రాష్ట్ర బంద్ నిర్వహించింది. జనసేన ఏకంగా జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లితో కలిసి జేఏసీ ఏర్పాటు సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రూటు మార్చి ప్రత్యేక సాయం పేరుతో ఒక వాదన పైకి తెచ్చింది. ఇక ఇప్పుడు జగన్ మరో అడుగు ముందుకేసి ఎంపీల రాజినామాలు అంటు కొత్త డ్రామా మొదలు పెట్టారు.పార్టీ సీనియర్ల తో సమావేశం జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా కనిగిరిలో జరిగిన సభలో పార్టీ నిర్ణయం ప్రకటించారు. మార్చి 1వ తేదీన కలెక్టరెట్లు ముట్టడి, మార్చి 5న ఢిల్లీలోని పార్లమెంట్ వేదికగా ఎంపీలు ధర్నాలు, ఏప్రిల్ 6న లోక్ సభలోని వైసీపీ ఎంపీ లు రాజీనామా చేస్తారాని ప్రకటించారు. రాజీనామా అనివార్యం అయితే బీజేపీ మిత్రపక్షంగావున్న టీడీపీ పరిస్థితి ఒక వైపు మింగనులేదు కక్కను లేదు అనే పరిస్థితి ఉంటుంది. టీడీపీ కూడా తమ ఎంపీల చేత రాజీనామాలు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక గతంలో హోదా విషయంలో ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం అని చేప్పిన పవన్ ఇప్పుడు ఏనిర్ణయం తీసుకుంటారో లేదొ చూడాలి.ఇప్పుడే కాదు గతంలోను జగన్ హోదా రాకుంటే మూడేళ్ళకే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని చెప్పారు. ఈ సంవత్సరాంతంలోనే ఎన్నికలు జరగవచ్చు అనే ఊహాగానాల నేపథ్యంలో జగన్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చు. వైకాపా చెందిన 8 మంది ఎంపీల్లో ముగ్గురు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.మిగిలిన ఐదుగురులో రాజీనామాల సమయానికి ఎంత మంది పార్టీలో ఉంటారో మరి..!?