పవన్ పశ్చిమ గోదావరి నుంచే పోటీ చేస్తారా?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రశ్నించే గొంతు ఈ రోజు ఒకే రాష్ట్రానికి మొగ్గు చూపునున్నదా? అంటే ఆవుననే చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన గృహాన్ని నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంత తక్కువ సమయంలో హడావుడిగా తన మకాంని అమరావతికి ఎందుకు మార్చుకుంటున్నారో అనేది ఎవరికి అంతు పట్టడం లేని విషయం.
పవన్ తన మకాంనే కాదు… ఓటరు గుర్తింపును తెలంగాణ నుంచి మార్చుకోబోతున్నాడని సమాచారం. వచ్చే ఎన్నికల సమయం నాటికి తన సొం త జిల్లా అయిన పశ్చిమ గోదావరి నుండి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్‌లోని తన ఓటు ను తరలించుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. అయితే జనసేన రెండు రాష్ట్రాలలో ఉంటుందనేది కేవలం ప్రసంగాలోనే కాని, పోటీలలో కాదని అనుకోవాలా?