FilmsNewsips

రేటు పెరిగిన ప్రభాస్ కు చోటు కరవయిందా..?

వైఫ‌ల్యాలు  విజయానికి మెట్లు అంటారు. మరి అన్ని మెట్లూ ఎక్కేస్తేనో..? ఇంక ఎక్కడానికి  ఏమీ లేకుంటేనో..? అది వైఫల్యం కన్నా ఎక్కువ ప్రమాదం.   ఇదే స్థితి ‘బాహుబలి’ హీరో ప్రభాస్ కు వచ్చిపడింది.
ఎందుకంటే తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశలా… వ్యాప్తి చేసి చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే బాహుబ‌లి లాంటి సినిమాలో హీరోగా చేసిన ప్ర‌భాస్ ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏంటి..?  ఏ తెలుగు హీరోకు దొరకని అరుదయిన ప్రపంచ  గౌరవం ప్రభాస్ కు దక్కింది.  తుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ నిలువెత్తు మైనపు బొమ్మగా వెలిశాడు.
అతనితో తీస్తే భారీ బడ్జెట్ తో తియ్యాలి. పారితోషికం కూడా అదే స్థాయిలో వుండాలి. మొత్తానికి ‘సాహో’ తో   ఆలోటు తీరింది కానీ,  కానీ దీని నిర్మాణం చాలా కాలం పట్టేటట్టు కనిపిస్తోంది.  ఇక మిగిలిన అవకాశాలు రావటం అంత సులువు కాదు.  ఇలాగయితే ప్రభాస్ కున్న ‘యవ్వన కాలం’ కాస్తా గడిచిపోతుంది. అందుకే కాబోలు  సొంత బ్యాన‌ర్ అయిన గోపీకృష్ణ  మూవీస్ ( పెదనాన్న క్రిష్ణం రాజు సంస్థ)  పై సినిమా చేసుకోవాల్సిన ప‌రిస్థితి ప్ర‌భాస్ కు వచ్చిపడింది.  పూజా హెగ్డే ఆయన సరసన నటిస్తోంది.
సినిమా ప్ర‌పంచానికి శాసిస్తూ ముందుకు క‌దులుతున్న ఆ రెండు,మూడు సామాజిక వ‌ర్గాల వ్యూహ చ‌తుర‌తే  ఈస్థితికి కారణం అనుకుందామా?  ఎందుకంటే గ‌తంలోనే.., 80,90 ద‌శ‌కంలో కూడా… ఆ ఒకటి, రెండు సామాజిక వ‌ర్గాలే సినీ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న త‌రుణంలో వారిని త‌ల‌ద‌న్ని, మ‌రో సామాజిక వ‌ర్గం నుంచి వచ్చిన హీరో ను కూడా  ఇలాగే  ఏకాకిని చేశారు.
       అపుడే చ‌తుర‌త అంటే  ఏంటో చూపించారు అవ‌త‌లి వారు. వారి వ్యూహంలో భాగంగా ఉన్న‌ప‌లంగా  అమాంతం
ఆయన పారితోషికం  పెంచి సింహాస‌నంపై కూర్చోపెట్టారు. దానితో  ఆ హీరో  కింద‌కు దిగి రాక, సినిమాలు చేసేవారు లేక, మొహానికి కొన్నేళ్ళు రంగు కూడా పూసుకోలేదు.
      అటువంటి ప‌రిస్థితే ఇపుడు ప్ర‌భాస్‌కు కూడా ఎదురైన‌ట్లుంది.
      తెలుగు సినిమా రంగుల ప్ర‌పంచాన్ని ఏలుతున్న సామాజిక వర్గాలేత‌రుడు మ‌న రాజు గారు. అందుకే కాబోలు  పొగడి పక్కన పెడుతున్నారు…!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *