షోకు సరే…‘ప్యాక్’ వుందా? లేదా?
సినీనటులకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరీ ముఖ్యంగా యువతకి. తమ అభిమాన నటుడి సినిమా విడుదల అవుతుందంటే హడావుడి అంత ఇంత కాదు. ఆ సినిమాలో తమ హిరో స్టైల్, వారు వేసుకునే క్యాస్ట్యూమ్స్ వరకు అన్నింటిని అనుకరిస్తుంటారు. అంతేకాకుండా ప్రక్క హిరోలతో పోల్చుకునే అభిమానులు చాలా ఎక్కువ అనే చెప్పవచ్చు టాలీవుడ్‌లో .
ప్రస్తుత కాలంలో ప్రతి హిరో వారి శరీరధారుడ్యాన్ని(ఫిజిక్ని) ఒక స్టార్‌డమ్‌గా చూపించుకోవడం పరిపాటి అయ్యింది. ఈ సాంప్రదాయం బాలీవుడ్ నుండి అరువు తెచ్చుకున్నదె అయినప్పటికీ, టాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే ఈ ట్రెండ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసి కొత్త ఫీట్ చేశారు. అందులో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హిరోల నుండి చిన్న హిరోల వరకు ఈ తరహాలో కనిపించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇదిలా ఉండగా మరికొంత మంది స్టార్ హిరోలు మాత్రం వాటి జోలికి పోకపోవటమే మంచిదని అనుకుంటున్నారు. టాలీవుడ్‌లో మరో స్టార్ హిరో ఒకసారి ట్రై చేసి వదిలేశాడు. అసలు ఆ ప్రస్తావనే లేకుండా వారి వారి సినిమాలు చేసుకుంటున్న హిరోలు పవన్ కళ్యాణ్, రవితేజలు. వీరిద్దరిలో రవితేజ ఒక సారి ట్రై చేసినప్పటికి చూపించుకోలేకపోయాడు. ఈ ముగ్గు హిరోలు మిగిలిన హిరోలతో పోల్చుకొని ప్రయత్నిస్తే కనుక వీరి ముఖ చాయలు మారిపోవడం ఒక కారణమైతే, వయసును మరొక కారణంగా చెప్పవచ్చు. అయితే లేటు వయసులో కూడా సిక్స్ ప్యాక్‌లో కనిపించిన టాప్ హీరోలు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ వున్న సంగతి తెలిసిందే . అలాంటివన్ని ముందే గ్రహించి ఆ వైపు వెళ్ళకుండా తమ స్టార్ డమ్ ను కాపాడుకోవటం విశేషం.