Andhra

తెలుగు రాష్ర్టాలలో బీజేపీకి తిప్పలే.. తిప్పలు!

రాష్ట్రాల‌న్నింటి క‌న్నా తెలుగు రాష్ట్రాలు వేర‌యా..! అన్న‌ట్లు దేశం మొత్తం మీద  బీజేపీ  హ‌వా కొన‌సాగుతుంటే, అందుకు దీటుగా ఇటు తెలంగాణ‌లోనూ, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ బీజేపీ కి మూడోస్థానం సైతం కరవయ్యే పరిస్థతి వుంది.  దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా  జాతీయ పార్టీగా వున్న బీజేపీ, తెలుగు రాష్ట్రాల విష‌యానికొచ్చే స‌రికి ప్రాంతీయ పార్టీకి సరితూగటం లేదు.
తెలుగు రాష్ట్రాల‌లో ప్రాంతీయ పార్టీల హ‌వా కొన‌సాగుతున్నది. నిన్న‌, మొన్న‌టి వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో మిత్ర‌ప‌క్షంగా వున్న పార్టీ తెగ‌తెంపులు చేసుకుంది.ఎన్డీఏలో  తెలంగాణ ప్ర‌భుత్వం కొంత కాలం భాగ‌స్వామిగా ఉండాల‌నుకున్నా కానీ ఇపుడు కేసీఆరే థ‌ర్డ్ ఫ్రంట్ మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో టిఆర్ఎస్ ఎంపీ క‌విత మ‌ద్దతు  తెలిపిన విష‌యం తెలిసిందే. తాజాగా క‌రీంన‌గ‌ర్ ఎంపి వినోద్ కుమార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబుకి స‌పోర్ట్ చేస్తామ‌నడంలో  అంత‌ర్యం ఏమిటి..? ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ అంటే  నిప్పులో ఉప్పు వేసిన‌ట్లు ఉండే టిఆర్ఎస్ నేత‌లు, హ‌ఠ‌త్తుగా యూ-టర్న్ తీసుకొవ‌డం ఎవ‌రికీ అంతుప‌ట్ట‌ని విష‌యం.
అయితే టిఆర్ఎస్ టీడీపీ తో క‌లుస్తాన‌న‌డం వెనుక ఫ్రంట్‌ను న‌డిపించ‌డంలో ఆరితెరిన బాబు స‌హాయం కోస‌మేనన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌మౌతున్నాయి. దీనివ‌ల్ల వీరిరువురికి ఏ లాభం ఉంటుందో..?  లేదో తెలియ‌దు కానీ కేంద్రంలో ఉన్న బిజెపికి మాత్రం న‌ష్టమేన‌నుకోవ‌చ్చు. ఇది ఏలా..? అంటే రాబోయే సాధార‌ణ ఎన్నిక‌ల‌లో అన్ని రాష్ట్రాలలో పాగా వేయాల‌నుకునే బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చుక్కేదురే.  ఈ రాష్ట్రాలు కాకుండా ఏ ఎన్డీయేత‌ర‌ రాష్ట్రాలు తీసుకున్నా అటు పాల‌క ప‌క్షంతొనో, ఇటు ప్ర‌తిప‌క్షంతొనో  దోస్తీ ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల‌లో చూసిన‌ట్ల‌యితే ఆటు ప్ర‌తిప‌క్షాల‌తోనూ, ఇటు పాల‌క‌ప‌క్షాలతొనూ క‌ల‌వ‌లేని స్థితి  ఉంది. దీని వ‌ల్ల ప్ర‌భుత్వ ఏర్పాటేమోగాని, త‌న స్థానాన్ని నిలుపుకుంటే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *