తెలుగు హీరోలకు తలంటిన ఎమ్మెల్సీ!
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఇప్పటికీ పోరు కొనసాగుతూనే ఉంది. ఆ ఉద్యమ తీవ్రత ఏకంగా రెండు మిత్రపక్షాలనే విడిపోయేలా చేసింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ హోదాపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చానీయాంశమైంది. అయితే ఈసారి ప్రతిపక్ష పార్టీలను కాకుండా సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం విశేషం.
తమిళ నటులను, తెలుగు చిత్ర నటులను పోల్చుతూ చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలను కలిగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన కావేరి జల వివాదమే కావచ్చు, జల్లికట్టు ఆంశంమే కావచ్చు. రాష్ర్టానికి సంబంధించినంత వరకు జరిగిన ఉద్యమాలకు మద్దతుగా ఆ రాష్ట్ర సినీ నటులు మద్దతు తెలపడమే కాకుండా, ప్రత్యక్ష అందోళనలోకూడా పాల్గొన్నారు. అయితే తెలుగు సినీ నటులు కూడా వారి లాగే చొరవ తీసుకుని ముందుకు వస్తే ఉద్యమానికి మరింత బలం చేకురుతుందని బావిస్తున్నారు. సినీ నటులకు పార్టీలు పెట్టడంలో ఉన్న ఉత్సాహం, ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనటంలో లేదు. ఇప్పటి వరకు ఒకరిద్దరు తెలుగు నటులు వచ్చినా, మెయిన్ స్ట్రీమ్ నటులు మాత్రం రావడంలో వెనకబడ్డారనే చెప్పవచ్చు. అయితే తమిళ నటులను స్పూర్తిగా తీసుకుని తెలుగు సినీ నటులు కూడా ప్రత్యక్షంగా పాల్గొం టే ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా బలోపెతం కావొచ్చు.