కేసీఆర్ దేశరాజకీయాలు రాష్ర్టం కోసమేనా..?
ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తూ కూడా, కళ్ళ ముందే క్రమక్రమంగా క్షీణిస్తూ ఉన్న బి.జే.పికి బహుశా ఆకర్షక శక్తి తగ్గిన కారణంగానేమో… మిత్ర పక్షాలైనా టి.డి.పి, శివసేన లాంటి మిత్రపక్షాలు దూరంగా జరుగుతున్నాయి. అలాగని కాంగ్రెస్ పుంజుకోవటం లేదు. సరికదా ఎక్కడికక్కడ చతికిల పడుతోంది. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా గ్రహించారు.
దేశ వ్యాప్తంగా చూసుకుంటే మోడీని ఎదుర్కొన్న నాయకుడి కనిపించనప్పటికీ, రాష్ట్రాల వారిగా చూస్తే ప్రతి రాష్ట్రంలో బలమైన పునాదులున్న ప్రాంతీయ పార్టీలు కనిపిస్తున్నాయి. అందులోనుండి వచ్చిన వ్యక్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
రాజకీయాల్లో విప్లవాత్మక, గుణాత్మక మార్పులు అంటూ పడికట్టు పదాలు ఉపయోగిస్తున్న కేసీఆర్, పైకి దేశ రాజకీయాలు చక్కబెడతానంటున్నా… రాజకీయ చతరుడుగా ఆయన అడుగులు మాత్రం రాష్ట్ర రాజకీయాలపై పట్టు నిలుపుకునే దిశగానే వెళ్తాయి. ఎందుకంటే ఆయన తొలి ప్రాధమ్యం రాష్ర్టం; మలి ప్రాధమ్యం దేశం. అందుకే, పేరు మోసిన జాతీయ పార్టీలను కాదని, శక్తి మంతమైన బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ వ్యాప్త పర్యటనలకు తెర తీశారు. అందులో భాగంగా మొట్ట మొదటి అంకంలో… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇతని తరువాత ఘట్టంగా ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలుస్తారా..? లేదా యస్.పి, బి.ఎస్.పి పార్టీ అధ్యక్షులను కలుస్తారా..? ఎందుకంటే ఇటీవల వీరి కలయికతో యూపీ ఉప ఎన్నికల్లో బి.జే.పికి దిమ్మతిరిగిన ఫలితాలను అందించాయి.
ఒక వేళ యస్.పి, బి.ఎస్.పిలతో ఈయన గారి స్నేహం వర్థిల్లితే… లక్ష్యం నెరవేరినట్లేనేమో… వారి ద్వారా తన రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించి తెలంగాణలో వున్న బడుగు,బలహిన వర్గాల మద్దతు కూడగట్టటం ద్వారా తనవిజయానికి రాచబాట వేసుకుంటున్నారేమో..!?