కేసీఆర్ ఫ్రంట్ కు పవార్ ’నంబర్‘ షాక్…!
ఆదిలోనే హంసపాదా?
కేసీఆర్ సమాఖ్య కూటమి ముమ్మర ప్రయత్నాలకు అప్పుడే స్పీడ్ బ్రేకరా..?
మహారాష్ట్ర బుల్ శరద్ పవార్ ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాడా?
ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఔనని అనిపిస్తోంది.
కాంగ్రెస్, భాజపేతర పార్టీలతో.. ఫెడరల్ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టిన కేసీఆర్ ప్రయత్నాలకు ఆరంభంలోనే ఆటంకాలు ఎందుకు?
రానున్న 27న ఢిల్లీ వేదికగా పవార్ చొరవతో బీజేపీయేతర పక్షాలనుంచి… వచ్చే గొంతు ఏ రూపంలో ఉండనుందో… ?
ఈ ఫ్రంట్ విషయంలో పవార్ నుంచి కేసీఆర్ కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకటి: శత్రుపరంగా; రెండు: సంఖ్య పరంగా.
కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లు.. రెండింటినీ శ్రతువులుగా చూపిస్తే, పవార్ ఒక్క బీజేపీనే శత్రువుగా చూపించారు.
రెండు కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న తెలంగాణలో వున్న పార్లమెంటు సీట్ల కన్నా, పవార్ వున్న మహరాష్ర్ట నుంచి వచ్చే పార్లమెంటు సీట్లే ఎక్కువ. మినీ భారతంగా పిలిపించుకుంటున్న యూపి పార్లమెంట్ స్థానం తరువాత గరిష్ఠ సంఖ్య(48)లో ఎంపీ స్థానాలున్న రాష్ట్రం మహారాష్ట్ర.
అటువంటి రాష్ట్రంలోనే కాక జాతీయ రాజకీయాల్లోనే… మొదటి నుండి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న పవార్ ఉన్నట్టుండి నిర్మితమౌతున్న కేసీఆర్ కూటమిలో ఎందుకు చేరాలి అన్న ఆలోచన వచ్చిందేమో… అందునా కేవలం 17 మంది ఎంపీలున్న రాష్ట్రానికి దేశ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పటానికి ఎవరూ సిద్ధపడరు కదా?
గతంలో ఎన్టీఆర్ ఐనా, చంధ్రబాబు ఐనా జాతీయ రాజకీయాల్లో నాయకత్వం వహించారంటే దానికి ప్రథమ కారణం రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలుండటమే… మరి అటువంటిది అతికొద్ది మంది ఎంపీలతో దేశ నాయకత్వ భాద్యతలు సాధ్యం అవుతుందా? మున్ముందు పరిస్థితులు కాస్త వేచి చూడాలి మరి…