ఏపీలో ఎం.పీ సీట్లు తగ్గుతాయా..?
అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వానికి చావు తప్పి కన్ను లోట్టపోయినట్లయింది. ఇప్పటికే ఆంధ్ర్రప్రదేశ్ విభజన జరిగి ఇంకా కోలుకోకముందే, మరో పిడుగు పడినట్లయింది. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… గతంలో 14 వ ఆర్థిక సంఘం పునర్విభజన సమయంలో 2001 జనభా లెక్కల ప్రకారం కాకుండా 1971 జనభా లెక్కల ప్రకారం చేశారు. దీని వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 10 అసెంబ్లీ స్థానాలు తగ్గి, 14 అసెంబ్లీ స్థానాలు పెరిగాయి.
అయితే తాజాగా 15 వ ఆర్థిక సంఘం సూచనల మేరకు 2011 జనభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడం జరుగుతుంది. ఇలా జరగడం వలన పార్లమెంట్ సీట్లు తగ్గిపోవడం జరుగుతుంది. దీని వల్ల ఇప్పటికే ఆంధ్ర్ర్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 42 ఎంపీ సీట్లకు కోత పడి 25కు చేరింది. అది ఇప్పుడు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కమిషన్ సూచనల నిబంధనలే ప్రగతిశీల రాష్ట్రాలపై నిషేదం విధించేవి కావు, అలాగే జనభా నియంత్రణ జరిపే రాష్ట్రాలకు ఒకరకంగా రాజకీయంగా అన్యాయమే జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంధ్రబాబు వాఖ్యనించారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చీలిక ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇది కేవలం ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఈ ప్రభావం ఉండనుంది. అయితే దీన్ని రాబోయే రోజులలో ఎలా ఎదుర్కొబోతారనేది మున్ముందు రోజులలో చూడల్సిందే …