తెలుగు ’కమలాని‘కి సినీ మేకప్!
దేశం మొత్తం మీద బీజేపీ హవా కొనసాగిస్తూనే, తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఇప్పటి వరకూ జనాకర్షక నేతలు దొరకలేదు. ఐతే అనుభవజ్జులకు లోటు లేదు. అద
తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ తారామణులు బిజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో ఒకరుః మాధవీ లత, మరొకరుః రేష్మా రాథోడ్. ఈ ఇద్దరు కూడా రాజకీయ అనుభవం లేనివారే.. మాధవి లత కర్ణాటక రాష్ట్రంలో జన్మించి తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మరో నటి రేష్మా రాథోడ్ తెలంగాణలో జన్మించి లా చదివి, మోడల్‌గా పేరు తెచ్చుకుని సీని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.
అయితే గతంలో ఈ విధంగా బిజెపి పార్టీలో చేరిన తారమణులు లేకపోలేదు. ప్రస్తుతం వారి జాడ కూడ బిజెపిలో కనిపించడంలేదు. వారు బిజెపి నుండి వివిధ పార్టీలోకి వలస వెళ్ళారు. సాక్షాత్తూ లేడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయశాంతి ముందు బీజేపీలోనే చేరారు. సరైన ఆదరణ లభించకపోవడంతో బయటకి వచ్చి తనే సొంత గూడు ఏర్పరచుకున్నారు.
కాగా మళ్ళీ చాలా కాలం తర్వాత నటీమణులు బిజెపిలోకి అడుగుపెడ్తున్నారు. అంతే కాకుండా సీనియర్ నటి, టిడిపి మహిళ అధ్యక్షురాలుగా చేసిన కవిత ఇటీవల కాలంలో బిజెపిలోకి వలస వచ్చారు. కాగా వీరికి బిజెపి పార్టీలో ఏలాంటి ప్రాధాన్యత లభించనుంది..? గతంలో నటీమణులను ఎలక్షన్ క్యాంపయిన్‌లో భాగంగా మాత్రమే సహకరించారు. వీరు కూడా ఎన్నికల వరకే పరిమితం అవుతారా..? లేదా తర్వాత కూడా పార్టీకి సేవలందిస్తారా..? అనేది తెలియాల్సివుంది.
రాబోయే ఎన్నికలలో ఏ చోట నుండి పోటీ చేయనున్నారు..? అనేది ఇంకా స్పష్టం కాలేదు. కాని వీరికి పార్టీ నుండి ఏమేరకు మద్దతు లభించనుంది..? పార్టీకి వీరు ఎలాంటి సహకారం చేయగలుగుతారనేది చూడాలి మరీ..