జేపీ బాటలో జేడీ వెళ్ళలేరా..?
ఎన్నికల కాలం వచ్చేసింది. ఈ సమయంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. నాయకులు వస్తారు. అయితే వారు ఎవరు అనేది గమనించాల్సింది. ఎన్నికల సమయంలోనే ఎనలేని ప్రేమ వస్తుంటుంది మన లీడర్లకు. గత ఎన్నికల ముందే సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదిలా వుండగా గత కొంత కాలంగా మాజీ సీబీఐ అధికారి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇదే విధంగా 2006లో ఎన్నికల ముందు మరోక సివిల్ సర్వీస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ కూడ తన ఉద్యోగాన్ని వదిలివేసి ప్రజల మధ్యకు వచ్చారు. అప్పటికే ఉన్న పార్టీలో చేరకుండా సోంత పార్టీ పెట్టి పోటీ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా రాష్ట్రం మొత్తం మీద పార్టీలో ఒక జె.పి. తప్ప ఎవరు గెలువలేదు. అదే సంవత్సరం కొత్త పార్టీలు ఆవిర్భవించాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాయి. మొత్తంగా ప్రజా యుద్ధంలో కొత్త పార్టీలు దెబ్బతిన్నాయి.
తాజాగా తన పదవికి రాజీనామా చేసి వచ్చిన జేడీ, జేపీలా కొత్త పార్టీ స్థాపిస్తారా? లేదా ఇప్పటికే వున్న పార్టీలలో చేరి తన రాజకీయ జీవితం ప్రారంభిస్తారా..? అనేది చూడల్సివుంది. ఒక వేళ ఏదైనా పార్టీలో చేరతారనుకుంటే, ఏ పార్టీలో చేరుతారు..? అయితే విలేకరుల సమావేశంలో ఇచ్చిన సమావేశంలో రాష్ట్ర పర్యటన చేస్తానని చేప్పడం జరిగింది. దీని బట్టి పార్టీ పెట్టే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తుంది.ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందనేది చూడల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలలో లీడ్‌లో వున్న పార్టీలు రెండు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానికోకటి ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. వైసిపిలో తన వ్యక్తిగత కారణాల వల్ల చేరకపోవచ్చు. మరో పార్టీ జనసేనను చూసినట్లయితే తన మాటను పవన్ వింటారా..? అనేది సందేహమే… ఇక అధికార పార్టీ అయిన టిడిపిలో చేరినట్టయితే తన వ్యక్తిగతంగా లాభమా? లేదా పార్టీకీ లాభమా ? అంటే ఒక రకంగా పార్టీకి లాభమే అనవచ్చు. జేడీ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కాబట్టి టిడిపి కాపు సామాజిక ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయనను ఆహ్వానించవచ్చు. అంతేకాకుండా జేడీ మాజీ సిఐడి అధికారి కావడం వల్ల పార్టీకి కలిసివస్తుంది.
కానీ ఈ పార్టీలలో చేరి రెండవ శ్రేణి నాయకునిగా ఉండడానికి ఇష్టపడతారా..? లేక తానే సోంత పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తారా..? ఒకవేళ సోంత పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి. ఇప్పటికే జేపీ ప్రారంభించిన లోక్‌సత్తా ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేయలేమని ప్రకటించడం కూడ జరిగింది. దీని బట్టి జేడీ నూతన పార్టీ స్థాపిస్తారా..? లేదా ప్రస్తుతమున్న ఏదో ఒక పార్టీలో చేరుతారా..? తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచిచూడల్సిందే…